Movie News

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్ చేయడం. మాములుగా ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ వస్తోందంటే దానికి విపరీతమైన హైప్ ఉంటుంది. కానీ విచిత్రంగా దీని విషయంలో అంత దూకుడు కనిపించకపోవడం ఒకరకంగా విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూసే. లేదంటే తమిళనాడు ఏమో కానీ తెలుగు రాష్ట్రాల్లోనే సీరియస్ కాంపిటీషన్ ఎదురుకోవాల్సి వచ్చేది. సో టాక్ వచ్చేదాకా భయపడేందుకు లేదు.

ఇక రెండోది సోషల్ మీడియాలో కాచుకున్న నెగటివిటీ. కారణాలు ఏమైనా విజయ్ దేవరకొండ ఒక వర్గానికి టార్గెట్ గా మారిన వైనం ఎక్స్, ఇన్స్ టాలో గమనించవచ్చు. ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక నెటిజెన్లు కొందరు అకారణంగా ద్వేషం పెంచుకున్నారా తెలియదు కానీ దీన్ని బద్దలు కొట్టాలంటే రణబాలికి యూనానిమస్ టాక్ రావాలి. విజయ్ ఈ మధ్య సెటిల్డ్ గా మాట్లాడుతున్నాడు. లైగర్ టైంలో తన అతిశయోక్తి మాటలు చెప్పుకోదగ్గ డ్యామేజ్ చేశాయని గుర్తించాడు కాబోలు.

వీటిని సరైన రీతిలో ఎదురుకుంటే రణబాలికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి ప్రీ ఇండిపెండెన్స్ సినిమాల సమస్య ఏమిటంటే జెన్ జీ బ్యాచుకి వీటి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. సైరా నరసింహారెడ్డికి సైతం చిరంజీవి ఇది ఫేస్ చేశారు. సో విజయ్ దేవరకొండకి ఈ సవాల్ ఇంకాస్త భారీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్టుగా ఇంత పెద్ద ఛాలెంజింగ్ రోల్ ఇంతకు ముందు చేయలేదు కాబట్టి, బెస్ట్ అనిపించే పెర్ఫార్మన్స్ తో పాటు అల్టిమేట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది.

ఇప్పుడు అందరి కళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఈసారి ఎలాంటి స్పీచ్ ఇస్తాడోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో దేవరకొండ జంట పర్సనల్ విషయాలు ఎక్కువ హైలైట్ కావడంతో ఈసారి టోన్ మార్చేసి సినిమా హైలైట్స్ కనిపించేలా సోషల్ మీడియాలో మైత్రి బృందం గేర్ మార్చింది. ఇది వర్కౌట్ అయ్యేలానే ఉంది. ఓపెనింగ్స్ కి ఇబ్బంది లేదు కానీ టాక్ విషయంలోనే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. అది నిలబెట్టుకుంటే అంతా హ్యాపీసే.

This post was last modified on October 12, 2026 11:25 pm

Share

Recent Posts

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 minutes ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

1 hour ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

3 hours ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

4 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

6 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

8 hours ago