మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ ఒక టాక్ షోలో చూశాం. మా టీవీ కోసం ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించి ఒక సీజన్లో తళుక్కుమన్నారు. కానీ ఆశించిన స్పందన లేకపోవడంతో తర్వాతి సీజన్‌కు ఆయన ఆ షోను హోస్ట్ చేయలేదు. అయినా సరే చిరు ఏమీ ఆగిపోలేదు. ఇప్పుడు మళ్లీ ఒక టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈసారి ఆయన షో చేస్తున్నది డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కోసం.
స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌తో మెగాస్టార్ చేతులు కలపడం.. దాని కోసం ‘మెగావర్స్’ అనే షో చేస్తుండడం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇంకా షూటింగ్ నడుస్తోంది. మరోవైపు ఈ షో గురించి ప్రమోషన్లు మొదలుపెట్టేసింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. హైదరాబాద్ సహా కొన్ని సిటీల్లో ఇంట్రెస్టింగ్ పోస్టర్లు వెలిశాయి.
Chiranjeevi అనే పేరుతో ‘N’ లెటర్ తీసేసి పోస్టర్లు వేయగా.. ఎన్ అక్షరం ఎందుకు మిస్సయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీని మీదే ఇప్పుడో వీడియో ప్రోమో కూడా వదిలారు. చిరంజీవి పేరులో మిస్ అయిన ఎన్ అక్షరం గురించి అందరూ ఆశ్చర్యపోతుంటే.. దాన్ని NETFLIX లోని N అక్షరంతో పూరించి, త్వరలోనే షో మొదలుకాబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు ఈ ప్రోమోలో. కొంచెం క్రియేటివ్‌గానే ఈ ప్రోమోను కట్ చేశారు.
మెగావర్స్ ఫస్ట్ ఎపిసోడ్‌లో చిరుకు అత్యంత సన్నిహితుడైన అక్కినేని నాగార్జునతో ఆయన తనయుతు నాగచైతన్య, అఖిల్ కనిపించబోతున్నారని సమాచారం. ఇంకా ప్రభుదేవా-తమన్.. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ.. పవన్ కళ్యాణ్-రామ్ చరణ్.. రవితేజ-నాని జోడీలు ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌లో సందడి చేస్తాయని అంటున్నారు. డిసెంబరులో ఈ షో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.
This post was last modified on November 24, 2026 5:50 pm
రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి తన స్థాయికి ఏమాత్రం తగని పేలవమైన సినిమాలు తీస్తున్నా.. కొన్ని ఇంటర్వ్యూలో దారుణమైన…
ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని…
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ ప్రముఖ టెక్ కంపెనీల విలువతో పాటు వాటి అధినేతల…
నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో రాజకీయ వేడి పెరుగుతోంది. త్వరలోనే ఇక్కడ మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైసీపీ…
డింపుల్ హయతి.. ఈ పేరు చూస్తే ఎవరో నార్త్ అమ్మాయి అనుకుంటాం. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయే అనే…