Political News

సెటిల‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న క‌విత‌!

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ ఎస్‌) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ.. క‌విత ఇప్ప‌టి వ‌ర‌కు స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. రాజ‌కీయంగా దూకుడు పెంచారు. ఇక‌, తాజాగా హైద‌రాబాద్ స‌హా ఖ‌మ్మం వంటి కీల‌క జిల్లాల్లో ఉన్న ఏపీకి చెందిన కుటుంబాల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్యంగా మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్‌లో సెటిలర్ల ఓటు అత్యంత కీల‌కం. దీనిని త‌న‌వైపు తిప్పుకొనే పార్టీలు న‌గ‌రంలో ప్ర‌భావం చూపిస్తున్నాయి.

తాజాగా క‌విత కూడా ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో కేవ‌లం తెలంగాణ హ‌క్కులు…. ఇక్క‌డి ప్ర‌జ‌ల మేలు కోస‌మే త‌న పార్టీ ప‌నిచేస్తుంద‌ని.. అవ‌స‌ర‌మైతే.. ఎంత వ‌ర‌కు అయినా వెళ్తామ‌ని ప్ర‌క‌టించిన క‌విత‌.. తాజాగా త‌న టంగ్ మార్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాల‌ని.. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల స్నేహంగా ఉండాలని సూచించారు. తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరులో నిర్వ‌హించిన వ‌న స‌మారాధన‌కు వ‌చ్చిన ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండాల‌ని రెండు రాష్ట్రాల‌ను కోరుకుంటున్నామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో కీల‌క‌మైన కృష్ణాన‌ది జ‌లాల‌పైనా క‌విత సానుకూలంగా మాట్లాడారు. ఏపీలో ఈ న‌దిపై అనుమ‌తులు లేకుండా ప్రాజెక్టులు క‌డుతున్నార‌న్న `భావ‌న‌`ను తెలంగాణ‌లో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. అయితే.. అనుమ‌తులు తీసుకున్నామ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతున్న‌ప్పుడు.. ఆ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింద‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు. త‌ద్వారా.. ఏపీలో అనుమ‌తులు ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు తీసుకున్నా.. త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్న వాద‌న‌ను వినిపించారు.

ఇరు రాష్ట్రాల మ‌ధ్య నీటి వినియోగం ఒక ఒప్పందం ప్ర‌కారం జ‌ర‌గాల్సి ఉంద‌ని క‌విత చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి ప‌నులు జ‌రిగేందుకు త‌మ స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. సెటిల‌ర్ల విష‌యంలో ఇప్ప‌టికీ కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. తాము అలా చేయ‌బోమ‌ని, సెటిల‌ర్లు కూడా.. తెలంగాణ బిడ్డ‌లేన‌ని చెప్పారు. వారు అక్క‌డ ప‌న్నులు క‌డుతున్నార‌ని గుర్తు చేశారు. నీటి పంపకాల విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాల‌ని చంద్ర‌బాబుకు విన్న‌వించారు. ఇలా.. సెటిల‌ర్ల విష‌యంలో క‌విత చేసిన వ్యాఖ్య‌ల వెనుక ఆమె వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on November 24, 2026 3:10 pm

Share

Recent Posts

చిరంజీవి పేరులో ఆ లెటర్ మిస్సయితే

మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ ఒక టాక్ షోలో చూశాం. మా టీవీ కోసం ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు…

1 hour ago

ఆర్జీవీ ఎప్పటికీ బతికుండే ప్లాన్

రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి తన స్థాయికి ఏమాత్రం తగని పేలవమైన సినిమాలు తీస్తున్నా.. కొన్ని ఇంటర్వ్యూలో దారుణమైన…

2 hours ago

ఆ ప్రాజెక్టు ఆపాలని జగన్ కు కేసీఆర్ వార్నింగ్: హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని…

2 hours ago

ఒక్కరోజులో 3 లక్షల కోట్ల లాభం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ ప్రముఖ టెక్ కంపెనీల విలువతో పాటు వాటి అధినేతల…

3 hours ago

శ్రీవిష్ణు పంచులు పాజిటివ్‌గా వెళ్తున్నాయా

నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్…

3 hours ago

గుడివాడ మ‌రో `తాడిప‌త్రి` అవుతోందా?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో రాజ‌కీయ వేడి పెరుగుతోంది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో వైసీపీ…

3 hours ago