Political News

ఆ ప్రాజెక్టు ఆపాలని జగన్ కు కేసీఆర్ వార్నింగ్: హరీష్ రావు

ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వైఎస్సార్ సమయంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా ఇదే మాదిరిగా తెలంగాణకు నీటి విషయంలో ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపుతవా లేదా అని జగన్ ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు చెప్పారు. అలా ఆపకుంటే ఆలంపూర్ దగ్గర బ్యారేజీ కట్టి నీళ్లు ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చిన నేత కేసీఆర్ అని అన్నారు. అనడమే కాదు, కేబినెట్ లో జోగులాంబ బ్యారేజీ జీవో ఇచ్చి ఆమోదించామని గుర్తు చేశారు. వాటర్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న కేంద్ర మంత్రి ఒక పక్క, జగన్ మరొక పక్క ఉన్న సమయంలో కేసీఆర్ ఈ మాట చెప్పారని అన్నారు.

అంతేకాదు, ఈ విషయాలన్నీ అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ మినిట్స్ లో అఫీషియల్ గా రికార్డ్ అయ్యాయని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అందుకే వైఎస్సార్ హయాంలో మంత్రి పదవులను గడ్డి పోచల్లా వదిలేశామని గుర్తు చేశారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ వచ్చి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ ను కోరారని చెప్పారు.

ఇవి తెలియకుండా రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఆ చిల్లర మాటలకు సమాధానిమివ్వక తప్పడం లేదని అన్నారు. రేవంత్ ది అతి తెలివి అని, కృష్ణా జలాల్లో 45 పర్సెంట్ వాడాను అని రేవంత్ అతి తెలివితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పర్సంటేజ్ తక్కువ ఉంటే టీఎంసీలు చెబుతున్నారని చురకలంటించారు. ఏపీ, తెలంగాణ వాడిన నీటి పర్సంటేజీ ఎంతో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. 2024-25లో ఏపీ 718 టీఎంసీల కృష్ణా జలాలు వాడితే, తెలంగాణ 286 టీఎంసీలు వాడిందని అన్నారు.

తెలంగాణకు కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపు 34 పర్సెంట్ అని, వాడింది 28 పర్సెంట్ అని అన్నారు. ఇక, 2025-26లో ఏపీ 771 టీఎంసీలు, తెలంగాణ 267 టీఎంసీలు వాడాయని, అంటే కేవలం 25 పర్సెంట్ మాత్రమే వాడారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే అతి తక్కువ వాడకం అని, చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. ఇంత తక్కువ నీటిని వాడినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

This post was last modified on November 24, 2026 5:15 pm

Share

Recent Posts

ఒక్కరోజులో 3 లక్షల కోట్ల లాభం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ ప్రముఖ టెక్ కంపెనీల విలువతో పాటు వాటి అధినేతల…

46 minutes ago

శ్రీవిష్ణు పంచులు పాజిటివ్‌గా వెళ్తున్నాయా

నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్…

1 hour ago

గుడివాడ మ‌రో `తాడిప‌త్రి` అవుతోందా?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో రాజ‌కీయ వేడి పెరుగుతోంది. త్వ‌ర‌లోనే ఇక్క‌డ మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో వైసీపీ…

1 hour ago

డింపుల్ హయతికి పెళ్లయిందా?

డింపుల్ హయతి.. ఈ పేరు చూస్తే ఎవరో నార్త్ అమ్మాయి అనుకుంటాం. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయే అనే…

2 hours ago

దేశంలో హాట్ టాపిక్:  ఏంటీ `తిరుప‌రంకుండ్రం` క‌థ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు దారితీసిన అంశం. సుప్రీంకోర్టులోనూ విచార‌ణ‌కు కీల‌క ప్రాధాన్యం ఏర్ప‌డిన అంశం.. త‌మిళ‌నాడులోని `తిరుప‌రంకుండ్రం`. గ‌త…

3 hours ago

మా ఆయ‌న్ని చంపాల‌ని ముందే ప్లాన్ చేశారు: సోనియా గాంధీ

దేశ మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ.. ఎల్‌టీటీ హ్యూమ‌న్ బాంబు దాడిలో త‌మిళ‌నాడులో చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి…

4 hours ago