ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా కూడా మారుతుంటాయి. ఇప్పుడు తమిళ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నాడు. అతను 2019లో జయం రవి సినిమా ‘కోమాలి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంతకంటే ముందు, 2018లో ప్రదీప్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ టైంలో అతను ‘గో బ్యాక్ మోదీ’ అంటూ ట్వీట్ వేయడం గమనార్హం. 2019 ఎన్నికలకు ముందు మోదీ.. తమిళనాడు పర్యటనకు రాబోతుంటే అక్కడి రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ ఆయన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ‘గో బ్యాక్ మోదీ’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇందులో ప్రదీప్ కూడా భాగం అయ్యాడు. మోదీని వెనక్కి వెళ్లిపోవాలంటూ ట్వీట్ వేశాడు.
ఈ ట్వీట్ వేసే సమయానికి ప్రదీప్ అనామకుడు. కానీ తర్వాత దర్శకుడిగా మారాడు. తొలి సినిమా ఒక మోస్తరుగా ఆడగా.. తనే హీరోగా నటిస్తూ తీసిన ‘లవ్ టుడే’తో అతడికి తిరుగులేని గుర్తింపు వచ్చింది. అది వంద కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసింది. ఆపై డ్రాగన్, డ్యూడ్ సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు కావడంతో ప్రదీప్ లెవెలే మారిపోయింది.
అనుకోకుండా ఇప్పుడు.. మోదీకి వ్యతిరేకంగా ప్రదీప్ వేసిన పాత ట్వీట్‌ను బయటికి తీసి అతడిని ఇరుకున పెడుతున్నారు నెటిజన్లు. మోదీ అనుకూలురేమో ప్రదీప్‌ను ట్రోల్ చేస్తుండగా.. మిగతా వాళ్లు అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఐతే తమిళనాట ఇప్పటికీ బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగానే రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రదీప్‌కు ఈ ట్వీట్ మరీ ఇబ్బందేమీ కాదనే చెప్పాలి. ప్రదీప్ గతంలో ఒక షార్ట్ ఫిలిం తీసి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వేసిన ట్వీట్లు సైతం అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.
This post was last modified on October 12, 2026 12:03 pm
ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…