Movie News

అందరికీ అది… రాజమౌళికి మాత్రం ఇదే

రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత అని విభజించి చూస్తారు. ఈ సినిమాతోనే ఆయన పాన్ ఇండియా స్థాయిలో గొప్ప పేరు సంపాదించారు. ‘ఆర్ఆర్ఆర్’తో అయితే వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. అందుకే రాజమౌళి ఫిల్మోగ్రఫీలో ‘బాహుబలి’ని అభిమానులు ప్రత్యేకంగా చూస్తారు. కానీ రాజమౌళి మాత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘బాహుబలి’ కాదు, ‘ఈగ’ అని చెబుతున్నారు. ఆ సినిమానే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, అదే తన ఫేవరెట్ అని రాజమౌళి చెప్పాడు.

‘ఈగ’ తనకు అంతగా నచ్చడానికి కారణాలు చెబుతూ.. తాను చేసిన అతి పెద్ద ప్రయోగం ఆ చిత్రమే అని జక్కన్న చెప్పాడు. ఈ రోజుకు కూడా ఈగను ప్రధాన పాత్రధారిగా పెట్టి సినిమా తీయాలనే ఆలోచన కొత్తగా అనిపిస్తుందని రాజమౌళి అన్నాడు. ఆ కథలోని భావోద్వేగాలు తన టీంలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయన్నాడు. అందరూ బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చూస్తారని.. కానీ తాను మాత్రం వ్యక్తిగతంగా ఈగకు ముందు, తర్వాత అని తన కెరీర్‌ను చూస్తానని జక్కన్న చెప్పాడు.

మరోవైపు ‘రామాయణం’ కథ గ్రంథాల్లో ఉన్నంత గొప్పగా.. సినిమాల్లో తెరకెక్కట్లేదనే అభిప్రాయాన్ని రాజమౌళి వ్యక్తం చేయడం విశేషం. ‘వారణాసి’లో ఆ లోటు భర్తీ చేయబోతోందనే సంకేతాలను జక్కన్న ఇచ్చాడు. ‘‘ఇతిహాసాలు రాసిన విధానానికి, వాటిని తెరపై చూపించిన విధానానికి చాలా తేడడా ఉంది. ఈ లోటే నన్ను చాలా ఏళ్లుగా ఆలోచింపజేసింది. చివరికి దాన్ని నేనే ఒక సవాలుగా స్వీకరించాను. ‘ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు, వాటిని ఎలా చూపించబోతున్నావు’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ సవాలే ‘వారణాసి’ సినిమాకు ప్రధాన పాయింట్’’ అని రాజమౌళి వివరించాడు. ఈ మాటల్ని బట్టి చూస్తే ‘వారణాసి’లో రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టమవుతోంది.

This post was last modified on October 12, 2026 11:57 am

Share

Recent Posts

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

12 minutes ago

డ్యూడ్ హీరో… మోదీనే పొమ్మన్నాడుగా

ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…

15 minutes ago

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

1 hour ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

2 hours ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

3 hours ago

స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు

గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…

7 hours ago