మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత కోన వెంకట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంచుమించు ఇదే మాట మొన్నామధ్య వేరే ఈవెంట్లలో చిరంజీవి కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే చిత్రీకరణ పరుగులు పెడుతోంది. చివరి వరకు ఒత్తిడి పెట్టుకోకుండా బ్యాలన్స్ ఉన్న పాటల కంపోజింగ్ ఒకవైపు జెట్ స్పీడ్ తో జరిగిపోతుంది. డిసెంబర్ రెండో వారంకల్లా గుమ్మడికాయ కొట్టాలనేది టార్గెట్.

ఇదిలా ఉండగా కాకాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఇంటరెస్టింగ్ గా ఉంది. దాని ప్రకారం చిరంజీవి ఇందులో మొత్తం మూడు లుక్స్, గెటప్స్ లో కనిపిస్తారు. మొదటిది ఆల్రెడీ టీజర్ లో చూశాం. ఆక్వా కంపెనీ నడుపుకునే ఒక మాములుగా వ్యక్తిగా చిరు కట్టుబొట్టు సింపుల్ గా అనిపించాయి. మరొకటి గ్యాంగ్ స్టర్. కోల్కతాని వణికించిన డాన్ అవతారాన్ని స్పెషల్ గా డిజైన్ చేశారట. మరొకటి ఊహించని ట్విస్టుతో ఉంటుందట. ఇదే మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు.

అలాని ఇది ట్రిపుల్ రోల్ కాదని అంటున్నారు కానీ డబుల్ ఫోటో ఉండొచ్చనే అనుమానాలు నిజమయ్యే అవకాశం లేకపోలేదు. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు ద్విపాత్రాభినయం చేయలేదు. కాకాలో నిజమైతే మటుకు మెగా ఫ్యాన్స్ కి డబుల్ పండగ ఖాయం. మెగాస్టార్ భార్యగా స్నేహ నటిస్తుండగా వీళ్ళ కూతురిగా మాటలు రాని మెడికో స్టూడెంట్ క్యారెక్టర్ లో అనస్వర రాజన్ చుట్టూ కీలక మలుపులు, భావోద్వేగాలు ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.

విశ్వంభర అడిగినా కూడా నో చెప్పి మరీ సంక్రాంతికి వస్తున్న కాకా పాటల పండగ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఏ విషయంలోనూ రాజీ పడకుండా బాబీ ఈ కాకాని తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది. తమన్ నిన్న ఎక్స్ లో అన్ని రికార్డులు తిరగరాస్తామని ఒక ఫోటో పెట్టి మరీ ట్వీట్ చేయడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రెట్టింపు చేసింది. వెంకటేష్, శర్వానంద్, శ్రీవిష్ణు, సాయిదుర్గ తేజ్, ప్రశాంత్ వర్మ మొదలైనవాళ్ళతో పండగ కాంపిటీషన్ టఫ్ గానే ఉంది.