రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ డిఫరెంట్ యాక్షన్ డ్రామాలో జెడి చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. విడుదల ఎప్పుడనేది ఇంకా డిసైడ్ కాలేదు కానీ సంక్రాంతి రేసులో అయితే మాస్ మహారాజా ఉండటం లేదనే క్లారిటీ వచ్చేసింది. హడావిడి వద్దనుకున్నారు కాబోలు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం తులాభారం ఒక జానర్ కు సంబంధించిన సబ్జెక్టు కాదట. క్రైమ్, సస్పెన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, హారర్, థ్రిల్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలను జోడించి ఒక కొత్త ట్రీట్ మెంట్ తో దర్శకుడు వివేక్ ఆత్రేయ దీన్ని రాసుకున్నట్టు తెలిసింది. సరిపోదా శనివారంలో పర్సనల్ రివెంజ్ మీద వెళ్లిన వివేక్ ఈసారి డిఫరెంట్ పాయింట్ టచ్ చేశారట. స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా ఆడియన్స్ మెదడుకు పని పెట్టే పద్దతిలో ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్ కి ఇది మంచి వార్తే.

రవితేజ ప్రస్తుతం ఇరుముడి సక్సెస్ ని నిలబెట్టుకునే దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ముందు అనుకున్న హసిత్ గోలి ప్రాజెక్టుని పెండింగ్ లో పెట్టారు. స్క్రిప్ట్ ఫైనల్ కాలేదని ఫిలిం నగర్ టాక్. దీనికి నిర్మాత దిల్ రాజు కాగా తులాభారంకి ఒకప్పుడు ఎస్విసిలో భాగస్వామిగా ఉన్న లక్ష్మణ్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. క్యాస్టింగ్ విషయంలో వివేక్ తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. అనస్వర, జెడి, తరుణ్ భాస్కర్ కాంబోని సెట్ చేయడంలోనే తన టాలెంట్ అర్థం చేసుకోవచ్చు.

అయితే హసిత్ గోలి మూవీ తర్వాత ఉంటుందా లేక పక్కన పెట్టారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రవితేజ కొత్త లుక్ బాగుంది. గతంలో చూడనిది కాకపోయినా కొంత విభిన్నంగా ట్రై చేసిన ఫీలింగ్ అభిమానులకు కలుగుతోంది. వేసవి విడుదలని టార్గెట్ చేసుకున్న ఈ ఆర్టి 78 షూట్ వేగంగానే చేయబోతున్నారు. మలయాళం నుంచి వచ్చి తెలుగులో బాగా బిజీ అవుతున్న అనస్వర రాజన్ తక్కువ టైంలోనే శ్రీలీలలాగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేయడం గమనించాల్సిన విషయం.