ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా పెట్టుకుని వయొలెన్స్ ని ప్రోత్సహించడం దర్శకులను రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్తోందని అర్థం చేసుకుని మెల్లగా రూటు మార్చే పనిలో ఉన్నాడు. బ్లడీ రోమియో గతంలోనే కమిటయ్యింది కాబట్టి ఇందులో కూడా హింసని మరీ ఓవర్ బోర్డు పెట్టకుండా యుఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేలా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారని టాక్. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.
ఇదిలా ఉండగా నాని తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడనే వార్త ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే ఈయన చాలా సెన్సిబుల్ దర్శకుడు. అయితే మన జనాల పల్స్ ఎంతమేరకు క్యాచ్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే విజయ్ సేతుపతి, త్రిష 96 తమిళంలో అద్భుత విజయం అందుకుంది. దాన్ని తెలుగులో శర్వానంద్, సమంతతో జానుగా ప్రేమ్ కుమారే రీమేక్ చేస్తే దారుణంగా డిజాస్టరయ్యింది. నిర్మాత దిల్ రాజుకు షాక్ ఇచ్చింది.
ఈయన మరో కల్ట్ మూవీ సత్యం సుందరం విమర్శకులను మెప్పించింది కానీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్ళలేదు. కార్తీ, అరవింద్ స్వామి పాత్రలను అందంగా చూపించిన తీరు హత్తుకున్నా అది భారీ వసూళ్లుగా మారలేదు. మరి నాని లాంటి ఇమేజ్, మార్కెట్ పెరిగిన హీరోని తనది కాని భాషలో ఎలా హ్యాండిల్ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నాని సోర్స్ ప్రకారం కథ చాలా బాగా వచ్చిందని, ఒక సిట్టింగ్ లోనే ఓకే అయ్యిందని తెలిసింది. ఏషియన్ సంస్థ ఈ కాంబో సెట్ చేస్తుందట.
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ కొంత టైం పట్టేలా ఉంది. గతంలో నాని శివకార్తికేయన్ డాన్ ఫేమ్ సిబి చక్రవర్తికి ఎస్ చెప్పి స్క్రిప్ట్ పరంగా ఏకాభిప్రాయం రాక నాని డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ కు ఆలా జరగకపోవచ్చు. నాని ఇప్పుడు మాస్, క్లాస్ రెండు వర్గాలను బాలన్స్ చేసే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిట్ 3, ప్యారడైజ్ కు కుటుంబాలు దూరంగా ఉన్నాయి. అవి ఇంతకు ముందులా దగ్గర కావాలంటే సాలిడ్ కంటెంట్స్ పడాలి. ఎవరిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates