ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5:20 గంటలకు నానా పటేకర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు CPR చేసినా ఫలితం లేకపోయింది.
తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు మణిపాల్ ఆసుపత్రి చీఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో దశాబ్దాల పాటు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నానా పటేకర్.. పరీందా, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్‌కమ్ వంటి ఎన్నో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నానా పటేకర్ ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ లెజెండరీ నటుడికి ఘన నివాళులు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates