Movie News

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి వేసిన ప్రిమియర్స్ నుంచి ఫుల్ నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజు కూడా అది కొనసాగింది. ఎక్కువమంది ఈ సినిమాలో అభ్యంతరం వ్యక్తం చేసింది జుగుప్స కలిగించే హింసాత్మక సన్నివేశాల విషయంలోనే. వయొలెన్స్‌ను మరీ అంత పచ్చిగా చూపించడం, గ్లోరిఫై చేయడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు.

ఐతే ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి ‘రణబాలి’ టీం పాఠం నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘రణబాలి’ సినిమాకు ఎడిటింగ్ పూర్తయ్యాక భిన్న రకాల ప్రేక్షకులు ప్రివ్యూస్ వేసి చూపించినట్లు తాజాగా మా ఇంటర్వ్యూలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వెల్లడించాడు. ఆ షోల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని కొన్ని సన్నివేశాల్లో హింసను తగ్గించినట్లు అతను తెలిపాడు.

‘రణబాలి’ రాయలసీమ ప్రాంతంలో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన పరిస్థితుల ఆధారంగా రూపొందిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇక్కడి ప్రజలపై బ్రిటిష్ వారి అకృత్యాలు.. వారి మీద రణబాలి తిరుగుబాటును చూపించారు. ఐతే వాస్తవంగా జరిగిన విషయాలే అయినప్పటికీ.. ఇప్పుడు అంతే తీవ్రతతో హింసాత్మక సన్నివేశాలను చూస్తే ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చని రాహుల్ సంకృత్యన్ అభిప్రాయపడ్డాడు. రాసేటపుడు, తీసేటపుడు ఇంటెన్స్‌గా ఉండాలని చూస్తామని.. కానీ స్క్రీన్ మీద చూసినపుడు ఎక్కువ హింస ఉంటే ప్రేక్షకులు తట్టుకోలేరని.. ఆ ఇంపాక్ట్ తర్వాత వచ్చే సన్నివేశాల మీద కూడా పడి, మూడ్ డిస్టర్బ్ అవుతుందని అతనన్నాడు.

అందుకే ‘రణబాలి’ ప్రివ్యూస్ వేసినపుడు ప్రేక్షకులు ఫీడ్ బ్యాక్‌ను అనుసరించి ఇందులో హింసాత్మక సన్నివేశాల్లో తీవ్రత తగ్గించినట్లు అతను వెల్లడించాడు. ఈ రకమైన జాగ్రత్త సినిమాకు మేలు చేసేదే. ‘ది ప్యారడైజ్’లో కూడా హింస మోతాదు తగ్గించి.. ఎడిటింగ్ ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉంటే భిన్నమైన ఫలితం వచ్చేదేమో.

This post was last modified on October 8, 2026 7:16 am

Share

Recent Posts

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

1 hour ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

9 hours ago