Movie News

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5:20 గంటలకు నానా పటేకర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు CPR చేసినా ఫలితం లేకపోయింది.

తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు మణిపాల్ ఆసుపత్రి చీఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.

హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో దశాబ్దాల పాటు తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నానా పటేకర్.. పరీందా, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్‌కమ్ వంటి ఎన్నో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నానా పటేకర్ ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ లెజెండరీ నటుడికి ఘన నివాళులు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

This post was last modified on October 8, 2026 7:52 am

Share

Recent Posts

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

2 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

3 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

4 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

4 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

9 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

10 hours ago