Movie News

బండ్ల గణేష్ కు జైలు శిక్ష

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతోపాటు 95 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, బాధితుడి కోర్టు ఖర్చులను కూడా గణేష్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో గతంలో కూడా జరిమానా, జైలు శిక్ష పడింది. అయితే, ఆయన ఆ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు.

2018లో ప్రకాశం జిల్లాకు చెందిన జానకి రామయ్య దగ్గర బండ్ల గణేష్ 95 లక్షలు అప్పు తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. జానకి రామయ్య మరణించగా ఆయన తండ్రి వెంకటేశ్వర్లుకు గణేష్ 95 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గణేష్ కు తాజాగా ఒంగోలు కోర్టు శిక్ష, జరిమానా విధించింది.

కాగా, గతంలో బండ్ల గణేష్ పై టాలీవుడ్ రచయిత వక్కంతం వంశీ చెక్ బౌన్స్ కేసు వేశారు. ఈ క్రమంలోనే బండ్ల గణేశ్‌కు 2017లో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ. 15.86 లక్షల జరిమానా విధించింది. టెంపర్ సినిమా కథకు సంబంధించిన పారితోషికం విషయంలో గణేష్ తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని వంశీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. ఈ రెండు కేసులే కాకుండా మరికొన్ని చెక్ బౌన్స్ కేసులలో కూడా బండ్ల గణేష్ పై కేసులు ఉన్నట్లు.. వాటిపై ఆయన అప్పీల్ కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

This post was last modified on November 18, 2026 6:08 pm

Share

Recent Posts

రామాయణ మేనియా.. థియేటర్లలో నాన్‌వెజ్‌కు బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…

2 hours ago

‘శ‌బ‌రిమ‌ల‌ను తిరుమ‌ల చేస్తా’: సీఎం ప్ర‌క‌ట‌న.. సాధ్య‌మేనా?!

కొన్ని కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయ‌కులు మాత్రం ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. తాజాగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని…

4 hours ago

లక్కీగా రేవంత్ సీఎం అయ్యారు: రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…

5 hours ago

ఈ విష‌యంలో మోడీని మెచ్చేసుకున్నారు!

అన్ని విష‌యాల్లోనూ కాక‌పోయినా.. కొన్ని కొన్నివిష‌యాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చూపే చొర‌వ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజ‌ధాని…

5 hours ago

‘వాళ్లంతా మూర్ఖులు.. వారికి సైన్స్ తెలీదు’

కేర‌ళ రాష్ట్రానికి చెందిన న‌టుడు, ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి త‌న నోటికి ప‌ని చెప్పారు. బీజేపీ…

6 hours ago

సూర్యకు విలన్‌గా గోపీచంద్?

సీనియర్ హీరో గోపీచంద్ మొదట ‘తొలి వలపు’ సినిమాతో కథానాయకుడిగానే ప్రయాణం మొదలుపెట్టాడు కానీ.. అతడికి నటుడిగా మంచి పేరొచ్చింది…

6 hours ago