Trends

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు స్ఫూర్తిగా నిలిచారు. అతను సాధించిన విజయం కారాగార సిబ్బందికి కూడా గర్వకారణంగా నిలిచింది. కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఎన్. సురేష్ విద్యారంగంలో ఈ అరుదైన ఘనత సాధించారు.

జైల్లో ఉంటూనే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన.. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన బీఏ కోర్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో అత్యధిక సమగ్ర మార్కులు సాధించి ప్రతిభా గోల్డ్ మెడల్‌తో పాటు బుక్ ప్రైజ్‌ను అందుకున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ షీవ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఎన్. సురేష్‌కు గోల్డ్ మెడల్, బుక్ ప్రైజ్ ప్రదానం చేశారు.

ఖైదీల్లో విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం ద్వారా వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి కారాగార శాఖ కృషి చేస్తోందని కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ డా. వి. సన్యాసిరావు తెలిపారు. ఎన్. సురేష్ సాధించిన గోల్డ్ మెడల్‌ ఈ కృషికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఎన్. సురేష్ ఈ ఘనత సాధించేందుకు మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, సహకారం అందించిన డీజీ, ఐజీ, డీఐజీ అధికారులకు, అలాగే అప్పటి కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఎస్. రాహుల్‌కు డా. సన్యాసిరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

This post was last modified on October 8, 2026 6:24 am

Share

Recent Posts

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

28 minutes ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

8 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

8 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

9 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

10 hours ago