Movie News

కాంతార మేక‌ర్స్ గొడ‌వ పెద్ద‌దే..

ఇండియాలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా ఎదిగిన హోంబ‌లే ఫిలిమ్స్‌కు గొప్ప పేరు, డ‌బ్బు తెచ్చిపెట్టిన సినిమా కాంతార‌. ఈ సినిమాతో హీరో క‌మ్ డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టి కూడా పాన్ ఇండియా స్థాయిలో సూప‌ర్ స్టార్‌గా ఎదిగాడు. కాంతారతో సెన్సేషన్ క్రియేట్ చేశాక ఇంకా భారీ స్థాయిలో కాంతార‌:ది చాప్ట‌ర్-1 తీసి ఇంకా పెద్ద విజ‌యాన్నందుకున్నారు రిష‌బ్, హోంబ‌లే అధినేత‌లు.

కానీ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో.. రిష‌బ్, హోంబ‌లే అధినేత‌ల‌కు మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. కొన్ని నెల‌ల ముందు రిష‌బ్, అత‌డి భార్య‌.. సోష‌ల్ మీడియాలో హోంబ‌లే సంస్థ‌ను అన్ ఫాలో చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఐతే అదేదో చిన్న మిస్ క‌మ్యూనికేష‌నేమో అనుకున్నారంతా. కానీ గొడ‌వ పెద్ద‌దే అని ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నిన్న కాంతార సినిమాకు 4 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా రిష‌బ్ శెట్టి ఒక పెద్ద పోస్టు పెట్టాడు. కానీ అందులో ఎక్క‌డా హోంబ‌లే సంస్థ ప్ర‌స్తావ‌న తీసుకురాలేదు. ఫొటోల్లోనూ హోంబ‌లే పేరు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. త‌ర్వాత హోంబ‌లే సంస్థ కూడా కాంతార యానివ‌ర్శ‌రీ పోస్టు పెట్టింది. అందులో రిష‌బ్ పేరు క‌నిపించ‌లేదు. పోస్ట‌ర్లో కూడా రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌గా రిష‌బ్ పేరు ప్ర‌స్తావ‌న రాకుండా చూసుకున్నారు. ఫొటో కూడా రిష‌బ్‌ను గుర్తుప‌ట్ట‌ని విధంగా కాంతార అవ‌తారంలో ఉన్నది వాడారు. ఈ ఒర‌వ‌డి త‌ర్వాతి రోజు కూడా కొన‌సాగింది.

కాంతార:చాప్ట‌ర్-1 యానివ‌ర్శ‌రీ పోస్టుల్లో రిష‌బ్ ఇంకా పెద్ద పోస్టు పెట్టి అందులోనూ హోంబ‌లేను అవాయిడ్ చేశాడు. హోంబ‌లే వాళ్ల‌యితే దీనికి కౌంట‌ర్‌గా ఒక పులి చిత్రం ఉన్న పోస్ట‌ర్‌తో యానివ‌ర్శ‌రీ పోస్టు పెట్టారు. ఈ సినిమాకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన‌ హీరో క‌మ్ డైరెక్ట‌ర్ ఫొటో లేకుండా పోస్ట‌ర్ వ‌ద‌ల‌డం అంటే ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యమే.

ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేసి హీరో క‌మ్ డైరెక్ట‌ర్, నిర్మాత‌ల మ‌ధ్య ఈ స్థాయిలో విభేదాలు రావ‌డం అనూహ్యం. ఈ గొడ‌వ చూస్తుంటే కాంతార‌-3 వ‌స్తుందా అన్న‌ది అనుమానంగానే ఉంది. ఒక‌వేళ రిష‌బ్ ఆ సినిమాను మొద‌లుపెట్టినా.. హోంబ‌లే నుంచి అభ్యంత‌రాలు త‌ప్ప‌వేమో.

This post was last modified on October 8, 2026 7:05 am

Share

Recent Posts

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

2 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

2 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

3 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

4 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

4 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

9 hours ago