ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి మార్చిలో విడుదల కావాల్సిన స్పిరిట్ స్థానంలో ఫౌజీ రావొచ్చనే ప్రచారానికి ఎలాంటి క్లారిటీ లేకపోవడం కొత్త అయోమయాన్ని సృష్టిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ప్లానింగ్ లో ఎలాంటి మార్పులు లేదన్న తరహాలో షూటింగ్ నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్ అందుబాటులో లేనప్పుడు తను లేని ఎపిసోడ్స్ వేగంగా లాగించేసి ఆన్ టైం ఉంటున్నారు.
కానీ ఫౌజీ కేసు అలా లేదు. దర్శకుడు హను రాఘవపూడికి దక్కుతున్న సమయం ఏ మాత్రం సరిపోవడం లేదట. ఇంకో రెండు నెలలు పని చేస్తే తప్ప గుమ్మడికాయ కొట్టలేమని నిర్మాతలతో అన్నట్టు టాక్. అదే నిజమైతే ముందు స్పిరిట్ ని రిలీజ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఫౌజీకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా చూసుకున్నా ఫిబ్రవరి కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం అనుమానమే. సో స్పిరిట్ రావడమే అన్ని రకాలుగా సేఫ్ గేమ్ గా కనిపిస్తోంది.
మన లెక్కలు, విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా ముందైతే రెండు టీమ్స్ నుంచి క్లారిటీ రావడం అత్యవసరం. ఎందుకంటే బయ్యర్లు కూడా ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇతర నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు వస్తాడనే దాన్ని బట్టి తమ రిలీజులు ప్లాన్ చేసుకునే ప్రొడ్యూసర్లు చాలా ఉన్నారు. అలాంటివాళ్లను దృష్టిలో ఉంచుకోవడం అవసరం. అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు వస్తోంది. కీలమైన అప్డేట్స్ అప్పుడైనా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
రాజా సాబ్ డిజాస్టర్ వచ్చిన ఏడాదిలోనే ఇంకో సూపర్ హిట్ తో దాన్ని మర్చిపోవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో అది జరగకపోవడం జస్ట్ బ్యాడ్ లక్ అంతే. ఫౌజీ, స్పిరిట్ రెండూ అయిపోతే తప్ప ప్రభాస్ అటు తన కోసం వెయిట్ చేస్తున్న నాగ్ అశ్విన్ కి పూర్తి స్థాయి కాల్ షీట్లు ఇవ్వలేడు. కల్కి 2 ఇప్పటికే హీరో లేని పోర్షన్స్ పూర్తి చేసిందట. బ్యాలన్స్ కోసం ఎదురు చూస్తోంది. బహుశా 2027 వేసవి నుంచి స్పీడ్ పెంచి అటుపై 2028 విడుదలకి కల్కి 2ని రెడీ చేయొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates