Movie News

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం గురించి హీరోలు మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం అందుకు భిన్నం. ‘ది ప్యారడైజ్’ రిలీజైన తర్వాతి రోజే.. ఈ సినిమా మీద వస్తున్న ట్రోల్స్, విమర్శల గురించి ఎక్స్‌లో పెట్టిన పోస్టులో ప్రస్తావించాడు. అంతే కాక దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి జరిపిన చిట్ ‌చాట్‌లో సినిమాలో లోపాల గురించి ఓపెన్‌గా డిస్కస్ చేశాడు.

ఇప్పుడు హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్‌ కోసం అనుపమ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో నాని.. ‘ది ప్యారడైజ్’ నష్టాల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడాడు. ఈ సినిమా ఫలితంతో నిర్మాత సంతోషంగానే ఉన్నట్లు చెప్పిన నాని.. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయిన మాట వాస్తవమని అంగీకరించాడు.

కానీ తొలి రోజు వచ్చిన టాక్‌ను బట్టి తాము అంచనా వేసిన దాంతో పోలిస్తే సినిమా చాలా ఎక్కువ వసూళ్లే రాబట్టిందని నాని అన్నాడు. కొన్ని చోట్ల సినిమా అంచనాలను మించి పెర్ఫామ్ చేసిందని, కొందరు మాత్రం నష్టపోయారని గుర్తించామని అతనన్నాడు.

మరోవైపు సుజీత్ దర్శకత్వంలో తాను చేయబోయే ‘బ్లడీ రోమియో’లో ఎక్కువ వయొలెన్స్ ఉండదని, ఉన్నా కూడా అది స్టైలిష్‌గా ఉంటుందని చెప్పిన నాని.. ఇలాంటి జానర్ తెలుగులో రానే లేదని చెప్పడం విశేషం. తన క్యారెక్టర్ ఇందులో చమత్కారంగా ఉంటుందని, వయొలెన్స్‌లో ఒక ట్విస్టు కూడా ఉంటుందని నాని తెలిపాడు.

మరోవైపు ‘బ్లడీ రోమియో’ తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా ఆసక్తికర కబురు చెప్పాడు నాని. అదొక అందమైన, సటిల్ లవ్ స్టోరీ అన్న నాని.. ఆ సినిమా అందరూ చూడదగ్గదిగా ఉంటుందంటూ ప్రేక్షకులకు అభయం ఇచ్చాడు. నితిన్ హీరోగా తాను ప్రొడ్యూస్ చేస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ బ్యూటిఫుల్ మూవీ అని.. ఇప్పటిదాకా దాని రష్ చూస్తే చాలా ఎగ్జైట్మెంట్ కలిగిందని నాని అన్నాడు.

This post was last modified on October 7, 2026 1:00 pm

Share

Recent Posts

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

7 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

53 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

2 hours ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

3 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

4 hours ago