Movie News

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా ఆశలే పెట్టుకుంది. ఇది ‘బాహుబలి’ స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశం అవుతుందంటూ పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చారు మేకర్స్. ట్రైలర్లో మహేష్ బాబు కూడా తమ సంస్థ గర్వంతో ప్రెజెంట్ చేస్తున్న మూవీ అని చెప్పుకున్నాడు. తీరా చూస్తే ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు.

కొంతమందికి సినిమా విపరీతంగా నచ్చింది. అద్భుతం అన్నారు. కానీ మెజారిటీ ప్రేక్షకులు తిరస్కరించారు. కమర్షియల్‌గా సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఓటీటీలో రిలీజయ్యాక దీన్ని ఒక కల్ట్ మూవీగా చాలామంది అభివర్ణించారు. ఐతే కేవలం ప్రశంసలు లభిస్తే సరిపోదు కదా.. కమర్షియల్ సక్సెస్ దక్కితేనే ఏ సినిమా మేకర్స్‌కు అయినా సంతోషం.

ఐతే ‘రావు బహదూర్’ అనుకున్నట్లు ఆడకపోయినా.. దర్శకుడు వెంకటేష్ మహాతో అదే నిర్మాతలు మరో సినిమాకు సిద్ధమయ్యారు. వెంకటేష్ కూడా తన చివరి సినిమా అనుకున్నంత ఆడలేదే అని బాధలో ఉండిపోకుండా వెంటనే సినిమా మొదలుపెట్టేశాడు. అప్పుడే ఈ సినిమాకు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసేశారు. ‘అట్టహాసం’ అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రంలో తానొక హీరోగా నటిస్తున్న సంగతి కూడా ఫస్ట్ లుక్‌తో బయటపెట్టేశాడు. అతడికి జోడీగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్రవంతి పెపకాయల నటిస్తుండడం విశేషం.

మహా దర్శకత్వం వహించిన కంచెర్లపాలెం ఎంత మంచి గుర్తింపు పొందిందో తెలిసిందే. ఇప్పుడు అదే బ్యాక్ డ్రాప్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో మరో హీరోగా కార్తీక్ రత్నం, అతడికి జోడీగా ‘పుష్ప-2’ ఫేమ్ పావని కరణం నటిస్తున్నారు. మంచి టైటిల్, కలర్ ఫుల్ ఫస్ట్ లుక్‌తో వెంకటేష్ మహా ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే వేశాడు. ఐతే ఈసారి అతను క్రిటికల్ అక్లైమ్‌కు పరిమితం కాకుండా కమర్షియల్‌గానూ సక్సెస్ అందుకునే సినిమా అందిస్తాడని ఆశిద్దాం. ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణారెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి నిర్మించగా.. ‘రావు బహదూర్’ సంగీత దర్శకుడు స్మరణ్ సాయినే దీనికీ పని చేస్తున్నాడు.

This post was last modified on October 7, 2026 1:16 pm

Share

Recent Posts

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

19 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

24 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

1 hour ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

3 hours ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

4 hours ago