Movie News

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఈ విషయం కొన్ని వందల సార్లు ఋజువయ్యింది. అయితే కంటెంట్ ఉంటేనే ఇది సాధ్యమవుతుందనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. అందులోనూ ఒక పెద్ద డైనోసర్ లాంటి సినిమా పోటీలో ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే క్రష్ అయిపోవడం ఖాయం. మొన్న శుక్రవారం విడుదలైన అనుమాన పక్షి ఇదే ఋజువు చేస్తోంది.

సినిమా బండితో పాపులారిటీ తెచ్చుకున్న రాగ్ మయూర్ హీరోగా రూపొందిన ఎంటర్ టైనర్ ఈ మూవీ. అసలు పాయింట్ ఇది కాదు. డీజే టిల్లు లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించడం అంతో ఇంతో జనం దృష్టిలో పడేలా చేసింది. పైగా ప్యారడైజ్ మీద విపరీతమైన హైప్ ఉందని తెలిసి కూడా కేవలం ఒక రోజు గ్యాప్ లో దాంతో తలపడటం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే సెప్టెంబర్ 25 అనుమాన పక్షి వచ్చిన సంగతే పబ్లిక్ కి అంతగా తెలియకుండా పోయింది.

ప్రతి విషయాన్ని అనుమానంతో చూసే యువకుడు సన్నీ అనుకోకుండా కాశ్మీర్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడో అమ్మాయిని ప్రేమిస్తాడు. హఠాత్తుగా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు హత్యకు గురవుతాడు. ఈలోగా వైజాగ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వాసు సతీసమేతంగా హాలిడే వెకేషన్ కోసం కాశ్మీర్ వస్తాడు. శవం కనిపించకుండా హీరో పడే పాట్లు, అసలు మర్డర్ ఎవరు చేశారో అంతుచిక్కని వైనం చుట్టూ స్టోరీ రాసుకున్నారు విమల్ కృష్ణ. కథాపరంగా ఎలాంటి కొత్తదనం ఉండదు.

ఆర్టిస్టులు ఎందరు ఉన్నా కథాకథనాల్లో బలం లేకపోతే ఏమవుతుందో చెప్పడానికి అనుమాన పక్షి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. హీరోకో అవలక్షణం పెట్టేసి దాని చుట్టూ క్రైమ్ కామెడీ అల్లడానికి చూసిన దర్శకుడు కనీస స్థాయిలో మెప్పించలేకపోయాడు. మళయాళం నుంచి వచ్చిన హీరోయిన్ మెరైన్ ఫిలిప్ కు నిరాశ తప్పలేదు. నిన్న ఆదివారమే అయినా చాలా చోట్ల కనీస ఆక్యుపెన్సీలు నమోదు చేయలేకపోయిన అనుమాన పక్షి ఎలాంటి అనుమానం రాకుండానే అంతర్ధానమయ్యేలా ఉంది.

This post was last modified on September 28, 2026 12:17 pm

Share

Recent Posts

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

1 hour ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

1 hour ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

2 hours ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

3 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

5 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

6 hours ago