Movie News

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం మేరకు మొత్తం నాలుగు రోజులకు గాను 140 నుంచి 150 కోట్ల మధ్యలో గ్రాస్ నమోదయ్యింది. నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టాక్ కి భిన్నంగా నిన్న మెయిన్ సెంటర్స్ దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. ముఖ్యంగా నైజామ్ నుంచి బలమైన మద్దతు దక్కడంతో హైదరాబాద్ తో సహా పలు చోట్ల భారీ నెంబర్లు వస్తున్నాయి.

ఇక్కడిదాకా బాగానే ఉంది. ఎలాంటి పోటీ లేకపోవడం, వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ తప్ప ఇంకే ఆప్షన్ కనిపించకపోవడం వల్ల వసూళ్లు ఇంత స్టడీగా ఉన్నాయనే కామెంట్ ని కొట్టిపారేయలేం. దానికి తోడు నాని సృష్టించుకున్న బ్రాండ్, తను ఎంచుకున్న జానర్ ఏదైనా ఒకసారి థియేటర్లో చూడాలనే ప్రేక్షకుల నమ్మకం వెరసి కలెక్షన్లు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయి. అలాని టాక్ అమాంతం మారిపోలేదు కానీ ఉన్నంతలో కొంత మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

అసలు పరీక్ష ఇకపై ఉంది. ఇవాళ సోమవారం నుంచి తిరిగి ఇంకో వీకెండ్ వచ్చేదాకా ఆక్యుపెన్సీలు ఎంత మేరకు డ్రాప్ అవుతాయనే దాని మీద ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర సైడ్ కొంచెం వీక్ గా ఉందని, ఇది మరింతగా తగ్గే ప్రమాదం ఉందని బయ్యర్ వర్గాలు అనుమాన పడుతున్నాయి. పబ్లిసిటీ పరంగా నాని టీమ్ అంతా చేసింది. రిలీజ్ తర్వాత మీడియాతో మీట్ నిర్వహించడంతో పాటు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా విడుదల చేశారు. యుఎస్ లో ఆల్రెడీ రెండు మిలియన్లు దాటేసింది.

ఒకవేళ ప్యారడైజ్ కనక దూకుడు కొనసాగిస్తే సూపర్ హిట్ స్టాంప్ పడిపోతుంది. ఎంత శాతం డ్రాప్ అనేది కీలకం కానుంది. పాజిటివ్ విషయం ఏమిటంటే జనాలకు థియేటర్ ఆప్షన్లు లేకపోవడం. ఒకవేళ నానికి ఎవరైనా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండి ఉంటే ఎలా ఉండేదో కానీ ఇప్పటికైతే సోలో రన్ ఎంజాయ్ చేయడంలో టీమ్ బిజీగా ఉంది. టాక్ తాలూకు ప్రభావం నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ఉందా లేదానేది కూడా ఇవాళ నమోదయ్యే నెంబర్లలో బయట పడుతుంది. చూద్దాం నాని ఏమేరకు ఫుల్ చేయబోతున్నాడో.

This post was last modified on September 28, 2026 11:03 am

Share

Recent Posts

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

35 minutes ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

48 minutes ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

2 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

4 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

5 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

5 hours ago