Movie News

రెండున్నర వేల కోట్లు తగ్గినా… షారుఖే నంబర్ వన్

ఒక్క ఏడాదిలో ఒక నటుడు రూ.2490 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడం అంటే చిన్న విషయమా? అయినా సరే ఆ నటుడు ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ట్యాగ్‌తో కొనసాగుతున్నాడంటే షాకవ్వాల్సిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విషయంలో ఇదే జరిగింది. 2026 సంవత్సరానికి హురున్ ఇండియా సంస్థ ప్రకటించిన అత్యంత ధనవంతులైన భారతీయ నటుల జాబితాలో షారుఖ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన నెట్ వర్త్ రూ.10 వేల కోట్లట. గత ఏడాది ఆయన రూ.12490 కోట్లతో నంబర్ వన్‌గా ఉన్నారు.

ఐతే ఏడాది వ్యవధిలో ఆయన నెట్ వర్త్ రెండున్నర వేల కోట్ల దాకా తగ్గిపోయింది. అయినా ఆయన అగ్రస్థానం మాత్రం చెక్కుచెదరలేదు. అధికారికంగా రూ.10 వేల కోట్ల ఆస్తితో ‘కింగ్ ఖాన్’ అనే బిరుదుకు తాను తగిన వాడినే అని షారుఖ్ రుజువు చేశాడు. షారుఖ్ సినిమాల్లో కంటే ప్రకటనల ద్వారా.. తన వ్యాపారాల ద్వారా ఎక్కువ సంపాదన పొందుతుంటాడు.

ఆయనకు రెడ్ చిల్లీస్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ యజమాని అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాపారాల నుంచి గత ఏడాది వ్యవధిలో నష్టాలు వచ్చాయేమో.. ఆయన నెట్‌వర్త్ తగ్గింది.

ఇక ఈ జాబితాలో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.4 వేల కోట్లు. ఆయన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రూ.1630 కోట్లు పెరగడం విశేషం. సల్మాన్ ఖాన్ రూ.3 వేల కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. హృతిక్ రోషన్ రూ.2500 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

గత ఏడాది రూ.7790 కోట్లతో షారుఖ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆయన వ్యాపార భాగస్వామి, నటి జుహి చావ్లా ఈసారి లిస్టులో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 1880 కోట్లతో లాస్ట్ ఇయర్ లిస్టులో ఉన్న కరణ్ జోహర్‌కు కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.

This post was last modified on September 24, 2026 6:00 pm

Share

Recent Posts

అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…

1 minute ago

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్తే

దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…

12 minutes ago

ఆఫీస్ ఓపెన్ చేయడానికి రెండేళ్లా?

టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…

1 hour ago

జబర్దస్త్ కమెడియన్… టాక్ ఆఫ్ ద టౌన్

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…

2 hours ago

టైసన్ నాయుడు ఏమయ్యాడని అడిగితే…

సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకప్పుడు తరచుగా సినిమాలతో పలకరించేవాడు. భారీ బడ్జెట్లలో, పెద్ద కాంబినేషన్లలో…

3 hours ago

అక్టోబర్ 15న తెలుగుప్రభ రీలాంచ్.. ‘జనం కోసం జర్నలిజం’

జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…

5 hours ago