Movie News

కేసీఆర్ మ్యాజిక్ ప్యారడైజ్ కు కలిసొచ్చిందా?

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ప్యారడైజ్ థియేటర్లలోకి వచ్చేసింది. నిన్నటి స్పెషల్ ప్రీమియర్స్ నుంచే సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే రిలీజ్ కు ముందు నాని పెట్టిన పర్మిషన్ ట్వీట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. డైరెక్టర్ ను మెచ్చుకుంటూనే సేఫ్టీ రూల్స్ గురించి ఆయన ఇచ్చిన రిప్లై సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.

కానీ తీరా సినిమా చూసిన తర్వాత థియేటర్లలో ఆడియన్స్ కు ఒక ఊహించని సర్ ప్రైజ్ తగిలింది. ముందే KCR రోల్ ఉన్నట్లు టాక్ వచ్చింది.. కానీ రూమర్ అని ఎవరు అంతగా పట్టించుకోలేదు. డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ప్రియదర్శి చేసిన ఎమ్మెల్యే శంకరన్న క్యారెక్టర్ మాజీ సీఎం కేసీఆర్ ను గుర్తుకు తెస్తుంది. డ్రెస్సింగ్, నడిచే స్టైల్, పక్కా తెలంగాణ స్లాంగ్.. ఇలా ప్రతిదీ ఆయన మేనరిజమ్స్ ను దించేశారు. దానికి తోడు ఆ పాత్రకు స్క్రీన్ మీద ఎలివేషన్స్ కూడా పడ్డాయి.

దీంతో ఆన్లైన్ లో మీమర్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్లు అయింది. సినిమాలో అచ్చం కేసీఆర్ లాంటి పాత్ర ఉందని, పైగా ఆ క్యారెక్టర్ కు మంచి మాస్ ఎలివేషన్ ఉందనే విషయం రేవంత్ కు ముందే తెలుసా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెలిసే ప్యారడైజ్ కు అంతలా సపోర్ట్ చేస్తూ సీఎం పోస్ట్ పెట్టారా అంటూ రకరకాల సెటైర్లు వేస్తున్నారు.

వాస్తవానికి సినిమా స్టోరీలో ఏముందో, ఏ నాయకుడి రిఫరెన్సులు ఉన్నాయో సీఎం స్థాయి వ్యక్తికి తెలియాల్సిన అవసరం అస్సలు ఉండదు. నాని అడిగిన పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ మీదే ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. పైగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ దర్శకుడు అని ఆయన పాజిటివ్ గానే ప్రత్యేకంగా ఓ పోస్టర్ కూడా వేశారు. కానీ పొలిటికల్ గా చూస్తే ఇలాంటి వ్యవహారాల్లో నాయకులు సేఫ్ గా ఉంటారు. జనాల్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయో అనే ఆలోచన ఉంటుంది. ప్రస్తుతం జనాల్లో అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ శంకరన్న ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఇది చూసి రేవంత్ టీమ్ ఏమనుకుంటుందో చూడాలి. ప్యారడైజ్ కు మాత్రం ఈ పొలిటికల్ రచ్చ భలే కలిసొచ్చింది. ఫ్రీ పబ్లిసిటీ గట్టిగానే దొరికేసింది.

This post was last modified on September 24, 2026 10:51 am

Share

Recent Posts

ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు ఇక అధికారికం..!

సోష‌ల్ మీడియాలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టా గ్రామ్ వంటి వాటిలో వీడియోలు, రీల్స్ చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను అధికారికంగా…

47 minutes ago

సూపర్ స్టార్ కోసం ‘సార్’ త్యాగం

బాక్సాఫీస్ వద్ద పోటీకి సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దసరా పండగ టార్గెట్ గా ఈసారి క్రేజీ సినిమాలు…

59 minutes ago

కొడాలి వార‌సుడికి వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదే.. !

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా మారింది. రాజకీయంగా ఆయ‌న త‌న త‌మ్ముడి కొడుకును…

2 hours ago

బాలయ్య ఆరాకి ఉన్న క్రేజ్ అలాంటిది

కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల ప్రభావం కేవలం ఒకటి రెండు భాషలకు పరిమితం కాదు. ఒక్కోసారి దేశాలు దాటిపోతుంది. వాటిలో…

2 hours ago

నాని సత్తాకు అసలు పరీక్ష మొదలయ్యింది

రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాని కెరీర్ లో మొట్టమొదటిసారి ఇంత అడ్వాన్స్…

3 hours ago

గ‌వ‌ర్న‌ర్‌కు అన్నీ చెప్పేశా.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే

డీఎస్సీ-2025లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి ఆరోపించారు. ఈ విష‌యంపై అన్ని ఆధారాల‌ను గ‌వ‌ర్న‌ర్…

11 hours ago