మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ ఖరారు చేస్తూ గత నెల చిరు పుట్టిన రోజు సందర్భంగా టీం టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాకా అంటే బాబాయి అని అర్థం. ఇందులోనేమో మలయాళ నటి అనస్వర రాజన్.. చిరుకు కూతురిగా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి చిరు ఎవరికి బాబాయి.. సినిమాలో జనం ఆయన్ని కాకా అని సంబోధిస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఐతే ‘కాకా’ వెనుక అసలు కథేంటో చిరు వెల్లడించారు.
సినిమాలో తన పాత్ర పేరును కూడా ఆయన ఒక కార్యక్రమంలో బయటపెట్టారు. ఈ కార్యక్రమానికి యాంకర్ స్రవంతి చొక్కారపు హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమె గురించి చిరు మాట్లాడుతూ.. తన సొంత ఊరు కదిరి అని, ఆ ఊరి పేరునే ‘కాకా’లో తన క్యారెక్టర్ పేరు కోసం వాడుకున్నామని వెల్లడించారు. అంతే కాక ‘కాకా’లో తన పేరు.. కదిరి కాళిదాస్ అని చిరు హర్షద్వానాల మధ్య వెల్లడించారు. ఆ కదిరి కాళిదాస్ అనే పేరునే షార్ట్ చేసి జనం చిరును ‘కాకా’ అని పిలుచుకుంటారని అర్థమైమంది.
నిజానికి బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిలే ‘కదిరి కాళిదాస్’ అని పెడతారనే సంకేతాలు ఇంతకుముందు కనిపించాయి. వేరే సినిమాల ఈవెంట్లకు వెళ్లి.. సరదాగా తన సినిమాల విశేషాలను లీక్ చేయడం అలవాటైన చిరు ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో తన సినిమా టైటిల్ ‘కదిరి..’ అంటూ చెప్పబోయి మధ్యలో ఆగిపోయారు. దీంతో ఈ సినిమా టైటిల్లో ‘కదిరి’ అనే పదం కచ్చితంగా ఉంటుందని అంతా అనుకున్నారు.
కానీ చివరికేమో టీం ‘కాకా’ అనే టైటిల్ ఖాయం చేయడంతో మెగాభిమానులు ఆశ్చర్యపోయారు. ఐతే ఇప్పుడు చిరు చెప్పిన మాట చూశాక అసలు విషయం అందరికీ అర్థమైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం సినిమా పూర్తి చేసిన చిత్ర బృందం.. చకచకా సినిమాను రెడీ చేసే ప్రయత్నంలో ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on September 21, 2026 10:48 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…