ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పెద్ద వివాదం నుంచి బయటపడ్డాడు. ఆయన ఇచ్చిన రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కావడంపై నమోదైన కేసులో ఫిర్యాదుదారుడు జెట్టి వెంకటేశ్వర్లు వెనక్కి తగ్గారు. కోర్టు వెలుపల ఇరు వర్గాలు రాజీకి రావడంతో ఈ వివాదం సమసిపోయింది. బండ్లతో తన గొడవ ముగిసిందని, ఇప్పుడు తామిద్దరం స్నేహంగానే ఉంటున్నట్లు స్వయంగా జెట్టి వెంకటేశ్వర్లు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఆర్థిక లావాదేవీల వివాదంలో ఒంగోలు కోర్టు ఇటీవల బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది. బండ్లకు సంబంధించిన పాత వివాదాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ వివాదం మీద బండ్ల ఎక్కడా నోరు విప్పలేదు. ఐతే ఇప్పుడు స్వయంగా ఫిర్యాదడారుడే తమ మధ్య గొడవ ముగిసిందని, బండ్లతో ఇప్పుడు తనకు మంచి అనుబంధమే ఉందని ప్రకటించడం ఆయనకు గొప్ప ఊరటనిచ్చేదే.
నిజానికి బండ్లకు వివాదం మొదలైంది జెట్టి వెంకటేశ్వర్లుతో కాదు. ఆయన కొడుకు, ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్యతో. ఆయన వద్ద 2018లో బండ్ల గణేష్ రూ. 95 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఐతే తర్వాత జానకి రామయ్య మరణించాడు. అప్పు తీసుకున్నపుడు బండ్ల ఇచ్చిన చెక్కును జానకిరామయ్య తండ్రి జెట్టి వెంకటేశ్వర్లు బ్యాంకులో డిపాజిట్ చెయ్యగా అది బౌన్స్ అయింది. దీనిపై బండ్లను సంప్రదించగా ఆయన నుంచి సరైన స్పందన లేకపోవడంతో వెంకటేశ్వర్లు కోర్టుకెక్కారు.
ఈ కేసులో ఒంగోలు కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష, రూ. 95 లక్షల జరిమానా విధించడంతో పాటు ఫిర్యాదుదారుడి కోర్టు ఖర్చులు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఐతే ఇప్పుడు బండ్ల, వెంకటేశ్వర్లు కోర్టు బయట రాజీకి రావడంతో కేసును కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెట్టి వెంకటేశ్వర్లు ఒక వీడియో విడుదల చేశారు. మీడియాలో వార్తలు, ఇంటర్వ్యూల వల్ల, మధ్యవర్తుల వల్ల తమ మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు తొలగిపోయాయని.. తమ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని, బండ్ల గణేష్‌తో స్నేహబంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
This post was last modified on November 25, 2026 10:35 pm
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొంతమంది నాయకుల మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి…
డిసెంబర్ 25 విడుదలకు రియాలిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. మూడోది ఈ వారంలో వదులుతున్నారు. ఆల్రెడీ…
ఎల్లుండి విడుదల కాబోతున్న భోగి మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. టీమ్ గత వారం రోజులుగా విస్తృతంగా ప్రమోషన్లు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇటీవల ఎదురైన సాంకేతిక సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. సంస్థకు చెందిన…
ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన మిస్ యూనివర్స్ 2026 పోటీలు ముగిశాయి. 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన…
మున్సిపల్ ఎన్నికలైన పాతిక రోజుల తర్వాత అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సజావుగానే కొనసాగింది. అదేం చిత్రమో…