Movie News

డ‌బ్బులే ముఖ్యం.. డ్యూటీ ఎక్కుతున్నా

స్టేజ్ ఎక్కి మాట్లాడినా.. ఏదైనా ఇంట‌ర్వ్యూ ఇచ్చినా చాలా కూల్‌గా మాట్లాడుతుంటాడు ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్ భాస్క‌ర్. ఎప్పుడూ స‌ర‌దాగా, న‌వ్వుతూ క‌నిపించే అత‌ను.. త‌న కొత్త చిత్రం ఈఎన్ఈ రిపీట్ స‌క్సెస్ మీట్‌లో ఒక్క‌సారిగా ఫైర్ అయిపోవడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎవ‌రి మాట‌లు హ‌ర్ట్ చేశాయో ఏమో కానీ… త‌న‌ను చాలామంది త‌క్కువ అంచ‌నా వేస్తున్నార‌ని, త‌నేంటో చూపిస్తాన‌ని, డ్యూటీ ఎక్కుతాన‌ని.. ఇక‌పై దిగేది లేద‌ని త‌రుణ్ ఛాలెంజ్ విస‌ర‌డం విశేషం.

చాలా త‌క్కువ అంచనా వేస్తున్నారు అంటూ ఒక‌టికి రెండుసార్లు చెప్పిన త‌రుణ్‌.. త‌న సినిమాల్లో ఎప్పుడూ డ‌బ్బు ముఖ్యం కాదు, డ‌బ్బుకు విలువ లేదు అనే చెబుతుంటాన‌ని, కానీ ఇక‌పై త‌న‌కు డ‌బ్బే ముఖ్యం అని వ్యాఖ్యానించాడు. ఇక‌పై డ‌బ్బునే ఫాలో అవుతా, అంద‌రూ లైన్లో నిల‌బ‌డాలి.. అంటూ ఆవేశంగా మాట్లాడాడు త‌రుణ్‌.

ఎ, బి, సి అని తేడా లేకుండా అన్ని సెంట‌ర్ల వాళ్లనూ టార్గెట్ చేస్తూ తాను సినిమాలు చేస్తానని.. ఇక‌పై తాను సీరియ‌స్‌గా డ్యూటీ ఎక్కుతాన‌ని, దిగే ప్ర‌స‌క్తే లేద‌ని త‌రుణ్ స్ప‌ష్టం చేశాడు.

త‌న‌కు ఎవ‌రూ లేర‌ని, త‌న వెంట ఉన్న‌ది ప్రేక్ష‌కులే అని.. ర‌జినీకాంత్ ఆండ‌వ‌న్ ఇరుక్కార్ (దేవుడు ఉన్నాడు) అని డైలాగ్ చెప్పిన‌ట్లు, త‌న‌కు ప్రేక్ష‌కులు ఉన్నార‌ని చెబుతాన‌ని.. త‌న మీద వాళ్లు ఎంతో ప్రేమ చూపించార‌ని.. వాళ్ల కోస‌మే సినిమాలు తీస్తానని త‌రుణ్ అన్నాడు. 

డైరెక్ట‌ర్‌గానా, న‌టుడిగానా అన్న‌ది ప‌క్క‌న పెడితే.. తాను చెప్పాల‌నుకున్న‌ది బ‌లంగా చెబుతాన‌ని, అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమాలు చేస్తాన‌ని త‌రుణ్ అన్నాడు. బ‌య‌ట ఏదైనా త‌ప్పు చేసినా, సినిమాలో దాన్ని క‌రెక్ట్ చేస్తాన‌ని కూడా త‌రుణ్ అన్నాడు. 

ప‌దేళ్ల‌కు పైగా కెరీర్లో త‌రుణ్ దర్శ‌కుడిగా నాలుగు సినిమాలే తీశాడు. కొంచెం గ్యాప్ త‌ర్వాత‌ ఈఎన్ఈ రిపీట్ సినిమాతో త‌రుణ్ పెద్ద హిట్టు కొట్టాడు. ఈ సినిమా చూసిన చాలామంది త‌రుణ్ గ్యాప్ లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని కోరుకున్నారు. అదే స‌మ‌యంలో ఈ సినిమాను కొంద‌రు త‌క్కువ చేసి మాట్లాడారు. ఈ నేప‌థ్యంలోనే త‌రుణ్ రెగ్యుల‌ర్‌గా సినిమాలు తీసి త‌నేంటో చూపించాల‌ని ఫిక్స‌యిన‌ట్లు క‌నిపిస్తోంది.

This post was last modified on November 25, 2026 11:36 pm

Share

Recent Posts

టీడీపీ సంచ‌ల‌న మిలియన్ రికార్డు

ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచ‌ల‌న రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్‌.. స్వ‌ల్ప‌కాలంలోనే 10 ల‌క్ష‌ల…

37 minutes ago

ప‌వ‌న్‌తో బెంగాల్ టైగ‌ర్ చేద్దామ‌నుకుంటే

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్లో ఒక సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి.. ఏడాదికి…

44 minutes ago

బ్యాటర్ లేకుండానే బౌలింగ్.. ఇదేం విచిత్రమైన ఔట్!

క్రికెట్‌లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా…

46 minutes ago

విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నారా?

రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ కీలక నాయకుడు, కొత్త పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నట్టు కనిపిస్తుంది.…

53 minutes ago

అన్‌స్టాపబుల్ పోలిక సమంజసం కాదేమో

మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున లాంచ్…

1 hour ago

త్రివిక్రమ్… ఇది మామూలు డ్యామేజ్ కాదు

రచయితగా విక్టరీ వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో…

2 hours ago