Political News

యూపీలో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? ఊడుతుందా??

“మేము ఆడుకునేవాళ్ళం కాదు…” ఈ మాటలు అన్నది ఎవరో దారినపోయే దానయ్య కాదు. ఏళ్ళ తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ. మరికొన్ని నెలల్లో దేశంలో అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027 ఫిబ్రవరి, మార్చి మధ్యలో జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ రెండు విడతలుగా చర్చలు జరిగినప్పటికి సీట్ల విషయం తెలలేదు. కాంగ్రెస్ అడుగుతున్నన్ని సీట్లుచ్చేందుకు ఎస్పీ సిద్ధంగా లేదు, ఎస్పీ ఇచ్చిన సీట్లతో సర్దుకొని పోటీకి వెళ్లే ఆలోచన కాంగ్రెస్ కు లేదు. దాంతో పీఠముడి పడింది. సీట్ల సర్దుబాటు కుదరక ముందే ఎస్పీ తొలివిడత జాబితా విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.

ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు వున్నాయి.  అందులో 130 నుంచి 106 స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది కనుక దానికి మరో 24 సీట్లు కలిపి 26 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదియించింది. దీనికి కాంగ్రెస్ ససేమిరా అంటుంది. ఎస్పీ దిగిరాను పో అంటుంది. పట్టు విడుపులు ప్రదర్శించకుండా ఇరు పార్టీల నాయకులు భేషజాలకు పోవడం సమస్యగా మారింది. అంతేకాకుండా ఎస్పీ ప్రకటించిన ఐదు సీట్లలో కాంగ్రెస్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఒక అసెంబ్లీ స్థానం ఉండటం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు.

2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 311 స్థానాల్లో, కాంగ్రెస్ 114 స్థానాల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 47, కాంగ్రెస్ 7 స్థానాల్లో మాత్రమే గెలిచాయి. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్లే తాము నష్టపోయామని ఎస్పీ నాయకత్వం భావించింది. దాంతో 2022 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఒంటరిగానే పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో గెలిచింది. ఎస్పీ మాత్రం 111 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పార్టీలు జట్టు కట్టెందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాలాంటిది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1989 వరకు కాంగ్రెస్ పార్టీ యూపీని అవిఘ్నంగా పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు ఎస్పీ సీట్లు ఇస్తే తీసుకోవాల్సిన దుస్థితికి చేరుకుంది. తాజాగా ఎన్నికల్లో ఎస్పీ తొలి జాబితా విడుదల చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని లైట్ గా తీసుకుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఉత్తర్​ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ మసూద్‌ తీవ్రంగా స్పందించారు. ఎస్పీ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని కుండబద్దలు కొట్టారు. సీట్ల కోసం మేమెవరినీ వేడుకోవడం లేదన్న ఆయన మేం బిచ్చగాళ్ళం కాదని స్పష్టం చేశారు. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు అభ్యర్థులను ప్రకటించడం చూస్తుంటే సీట్ల సర్దుబాటుపై ఎస్పీకి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతోందని విమర్శించిన మసూద్ తదుపరి చర్చలకు పోవాలా వద్దా అనేది ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ ఈ విషయంపై మాట్లాడుతూ…చర్చలు పూర్తయ్యే వరకు ఎస్పీ వేచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఉత్తర ప్రదేశ్లో ఈసారి కూడా కాంగ్రెస్, ఎస్పీ చీలిక ఓట్లు బీజేపీకి వరం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

This post was last modified on November 25, 2026 10:58 pm

Share

Recent Posts

బాబు స్పీడుగా ఉన్నారు: ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌శంస‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పీడుగా ప‌నిచేస్తున్నార‌ని, ఈ స్పీడు చూస్తే.. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు అనుకున్న స‌మ‌యానికంటే కూడా…

3 hours ago

ఈ సర్ మాకొద్దు బాబోయ్

కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌(స‌ర్‌)పై దేశంలోని ప‌లు రాష్ట్రాలు అభ్యంత‌రం…

4 hours ago

టీడీపీ సంచ‌ల‌న మిలియన్ రికార్డు

ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచ‌ల‌న రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్‌.. స్వ‌ల్ప‌కాలంలోనే 10 ల‌క్ష‌ల…

5 hours ago

ప‌వ‌న్‌తో బెంగాల్ టైగ‌ర్ చేద్దామ‌నుకుంటే

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్లో ఒక సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి.. ఏడాదికి…

6 hours ago

బ్యాటర్ లేకుండానే బౌలింగ్.. ఇదేం విచిత్రమైన ఔట్!

క్రికెట్‌లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా…

6 hours ago

విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నారా?

రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ కీలక నాయకుడు, కొత్త పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నట్టు కనిపిస్తుంది.…

6 hours ago