Trends

బ్యాటర్ లేకుండానే బౌలింగ్.. ఇదేం విచిత్రమైన ఔట్!

క్రికెట్‌లో బౌలర్‌కు ఫ్రీ హిట్ లాంటి అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ ఆలస్యంగా క్రీజులోకి రావడంతో బ్రిస్బేన్ హీట్ బౌలర్ సారా గ్లెన్‌కు ఖాళీ స్టంప్స్‌పై బంతి వేసే అవకాశం దక్కింది. గ్లెన్ నేరుగా స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో ఆమె ఔట్ అయ్యింది.

బుధవారం బ్రిస్బేన్ హీట్‌తో మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ లక్ష్య చేదనలో ఉండగా ఓ వికెట్ పడింది. ఆ తర్వాత డాటిన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయానికి క్రీజులోకి చేరుకోలేదు. దీంతో అంపైర్లు WBBLలో అమల్లో ఉన్న 75 సెకన్ల నిబంధనను వర్తింపజేశారు. డాటిన్‌ను పిచ్‌కు పక్కగా నిలబడాలని సూచించారు. ఆ తర్వాత సారా గ్లెన్ బౌలింగ్ చేయగా బంతి డైరెక్ట్ గా స్టంప్స్‌ను తాకింది.

అసలు ఈ నిబంధన ఏంటంటే.. MCC క్రికెట్ చట్టాల్లోని లా 40 ప్రకారం వికెట్ పడిన తర్వాత కొత్త బ్యాటర్ నిర్ణీత సమయంలో బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉండాలి. సాధారణంగా దీనికి మూడు నిమిషాల సమయం ఉంటుంది. కానీ WBBLలో దాన్ని 75 సెకన్లకు తగ్గించారు. సమయానికి రాకపోతే బ్యాటర్ పక్కకు వెళ్లి నిలబడాలి. అప్పుడు బౌలర్ ఖాళీ స్టంప్స్‌పై బంతి వేస్తాడు. వికెట్లను తాకితే బ్యాటర్ ఔటవుతాడు. తాకకపోతే డాట్ బాల్‌గా లెక్కిస్తారు.

గతంలో 2023 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ కూడా టైమ్డ్ ఔట్ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హెల్మెట్ సమస్య కారణంగా ఆలస్యం కావడంతో అతడు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుదిరిగాడు. అయితే WBBLలో ఆలస్యంగా వచ్చిన బ్యాటర్‌కు ఖాళీ స్టంప్స్‌పై బంతి వేసే ప్రత్యేక నిబంధన ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ చేసిన 137 పరుగులను మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

This post was last modified on November 25, 2026 11:33 pm

Share

Recent Posts

టీడీపీ సంచ‌ల‌న మిలియన్ రికార్డు

ఏపీ అధికార పార్టీ టీడీపీ సంచ‌ల‌న రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ ప్రారంభించిన `మై-టీడీపీ` యాప్‌.. స్వ‌ల్ప‌కాలంలోనే 10 ల‌క్ష‌ల…

37 minutes ago

ప‌వ‌న్‌తో బెంగాల్ టైగ‌ర్ చేద్దామ‌నుకుంటే

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్లో ఒక సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి.. ఏడాదికి…

44 minutes ago

విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నారా?

రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ కీలక నాయకుడు, కొత్త పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గందరగోళంలో వున్నట్టు కనిపిస్తుంది.…

53 minutes ago

అన్‌స్టాపబుల్ పోలిక సమంజసం కాదేమో

మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున లాంచ్…

1 hour ago

త్రివిక్రమ్… ఇది మామూలు డ్యామేజ్ కాదు

రచయితగా విక్టరీ వెంకటేష్ కు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో…

2 hours ago

ఓటు వేయడానికి మీరు కారం పొట్లాలతో రండి

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కొంతమంది నాయకుల మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి…

2 hours ago