హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే పంథాలో చాలా సినిమాలు చేసి ఫ్లాపులు రుచి చూశాడు. ఆ మధ్య ఒకటి రెండు సెంటిమెంట్ జానర్లు ట్రై చేసినా అవి కనీసం థియేటర్లకు వచ్చాయని జనాలు గుర్తించే లోపే మాయమైపోయాయి. ఇక ఓటిటిల సంగతి సరేసరి. అయినా సరే తన పని తన జీవితంలో బిజీగా ఉండే సంపూర్ణేష్ వచ్చే వారం విడుదల కాబోతున్న ప్యారడైజ్ లో బిర్యానీ పాత్ర చేశాడు.
మా ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు. ఇప్పటిదాకా చూసిన సంపూ ఇప్పుడు చూడబోయే ప్యారడైజ్ సంపూ రెండు వేర్వేరని, తనలో నటుడిని సరికొత్తగా ఆవిష్కరించేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేశాడని చెప్పుకొచ్చాడు. రీటేకుల విషయంలో రాజీ పడకుండా నాని, శ్రీకాంత్ కష్టపడిన తీరు తమకెంతో స్ఫూర్తిగా నిలిచిందని వివరించాడు. మోహన్ బాబుతో ఉన్న కాంబినేషన్ సీన్లు సైతం అద్భుతంగా పండాయని మురిపెంగా చెప్పుకున్నాడు.
నిజంగా ప్యారడైజ్ కనక బ్లాక్ బస్టర్ అయితే సంపూర్ణేష్ కు మరో కొత్త ఇన్నింగ్స్ దొరికినట్టే. ఎందుకంటే ఇండస్ట్రీలో కమెడియన్ల కొరత ఎంత ఉందో సీరియస్ క్యారెక్టర్లు చేసే నటుల కొరత కూడా అంతే ఉంది. దాన్ని పూడ్చే వాళ్ళు లేక హీరోలతోనే అన్ని ఎమోషన్లు పండేలా దర్శకులు కథలు రాసుకుంటున్నారు. సంపూలాంటి వాళ్లకు ఇలా అవకాశాలు ఇస్తే ఒక్కోసారి మేజిక్ చేస్తారు. శ్రీకాంత్ ఓదెల వాడకం ఆ రేంజ్ లో ఉందనేది సంపూర్ణేష్ మాటల్లో అర్థమవుతోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం నాని పోషించిన జడల్ ప్రాణ స్నేహితుడిగా, అనుచరుడిగా సంపూర్ణేష్ పాత్ర ఉండబోతోంది. ఒక కీలక మలుపుకు ఇదే కారణం అవుతుందని అంటున్నారు. ఇంకో అయిదు రోజులు మాత్రమే ఉండటంతో రిలీజ్ కోసం నాని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నెలల తర్వాత ఒక ఊర మాస్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ మీదకు వస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడానికి నాని సిద్ధంగా ఉన్నాడు. దాని కోసమే అందరూ వెయిటింగ్.
This post was last modified on September 20, 2026 5:34 am
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…