మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ బాధను అర్థం చేసుకుని మహిళలకు సహకరించే మగాళ్లుంటారు. ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకునే మగాళ్లూ ఉంటారు. నిజానికి ఈ టాపిక్ గురించి ఒకప్పుడు ఎవ్వరూ ఓపెన్‌గా డిస్కస్ చేసేవారు కాదు. మహిళలు తమ బాధను చెప్పుకునే వారు కూడా కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.
పీరియడ్స్ చుట్టూ ఉన్న నిడూఢతను ఛేదించి సెలబ్రెటీలు సైతం దాని గురించి ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారు. ఇటీవల ‘ఎపిక్’ సినిమాలో ఈ టాపిక్ మీద ఒక పావుగంట పాటు సన్నివేశాలు కూడా పెట్టడం గమనార్హం. ఇదే సమయంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్‌తో కలిసి చేసిన ఒక పాడ్‌కాస్ట్‌లో పీరియడ్స్ గురించి.. అలాగే తనకున్న పీఎంఓఎస్ సమస్య-మాతృత్వంలో ఉన్న ఇబ్బంది గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడింది.
తనకు 13 ఏళ్ల వయసులో పీరియడ్స్ మొదలయ్యాయని.. తొలిసారే చాలా తీవ్రమైన నొప్పితో బాధ పడ్డానని ఆమె చెప్పింది. తన తల్లి అప్పుడు తన బాధను వెంటనే గుర్తించి చాలా ప్రేమగా వ్యవహరించిందని, ఎక్కువ నొప్పి అన్నది తన నుంచే వారసత్వంగా వచ్చిందంటూ బాధ పడిందని శ్రుతి గుర్తు చేసుకుంది. తనకు పీరియడ్స్ టైంలో ఏ స్థాయిలో ఇబ్బంది ఉండేదో గుర్తు చేసుకుంటూ.. కొన్నిసార్లు స్పృహ తప్పే పరిస్థితి తలెత్తి, ఆసుపత్రిలో చేరి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది.
వర్క్ టైంలో పీరియడ్స్ అంటే మరీ ఇబ్బంది అని.. ఇలాంటి సమమంలో మహిళల బాధను కొందరు మగాళ్లు అర్థం చేసుకోలేరని.. అందుకే మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని వెయ్యిసార్లైనా ప్రార్థించి ఉంటానని శ్రుతి చెప్పింది. అప్పుడే మహిళలకు పీరియడ్ టైంలో సెలవులు ఇవ్వాలని కాంట్రాక్టులు పెడతారనే ఆమె అంది.
మరోవైపు తనకున్న సమస్య వల్ల పిల్లల్ని కనే అవకాశం ఉండదని టీనేజీలోనే డాక్టర్లు చెప్పేశారని.. దీంతో తాను మాతృత్వం, పిల్లల గురించి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండిపోయానని. కానీ కొన్నేళ్ల ముందు ఒక వైద్యురాలు తన ఆలోచనను మార్చిందని శ్రుతి చెప్పింది. ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పిల్లల్ని కనే అవకాశం గురించి ఆమె చెప్పిందని.. అలాగే ఒక బిడ్డను దత్తత తీసుకునే అవకాశం కూడా ఉందని.. ఐతే తాను తన ద్వారానే బిడ్డను కనాలని ఆలోచిస్తున్నట్లు శ్రుతి వెల్లడించింది.
This post was last modified on September 19, 2026 5:26 pm
జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…