భారతదేశ పారిశ్రామిక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ప్రెస్ బుల్లెట్ వేగంతో ముందుకు దూసుకొని వెళుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎక్కడో 9 వ స్థానంలో వుంది. ఈ మూడేళ్లలో దేశంలో రెండవ స్థానానికి ఎగబాకింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు చంద్రబాబు వేగాన్ని అందుకోలేక చేతులెత్తేస్తున్నారు. తమిళనాడులో ఘటనతో పారిశ్రామిక రంగంలో ఈ చర్చ జరుగుతుంది.
తమిళనాడు ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక నోడల్ ఏజెన్సీ అయిన ‘గైడెన్స్ తమిళనాడు’ నుండి పెట్టుబడి సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీక్ అయిందన్న ఆరోపణలు, 15 మంది ఉద్యోగుల తొలగింపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. తమిళనాడుకు రావాల్సిన సుమారు 1,614 కోట్ల రూపాయల విలువైన దక్షిణ కొరియా కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలు, వ్యూహాలకు సంబంధించిన కీలక సమాచారం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చేరిందనేది ప్రధానమైన ఆరోపణ.
వెంటనే విజయ్ ప్రభుత్వం గైడెన్స్ తమిళనాడుకు చెందిన 15 మంది ఉద్యోగులను తొలిగించింది. తొలిగించిన ఉద్యోగుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిలో చేరారని, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో వారు ఏపీ ప్రతినిధులుగా పాల్గొన్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు.
నిజానికి ఇదంతా అర్ధం పర్ధం లేని ఆరోపణలుగా కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న వేగవంతమైన అనుమతుల విధానం వల్లనే పరిశ్రమలు ఇటు వైపు వస్తున్నాయని వివరిస్తున్నారు. ఏపీలో ఉన్న మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాల వల్లే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి తప్ప, ఎవరి రహస్య సమాచారంతోనో కాదని అధికార టీడీపీ స్పష్టం చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి పరిస్థితులు వేరు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత పరిస్థితులు వేరుగా వున్నాయన్నది వాస్తవం. ఇండియాస్టాట్, ప్రాజెక్ట్స్ టుడే విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ వాటా ఆర్థిక సంవత్సరం 2024లో కేవలం 3.01 శాతంగా ఉండగా, 2026 నాటికి ఏకంగా 15.36 శాతానికి దూసుకెళ్లింది. తద్వారా దేశంలోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న కర్ణాటక వాటా 8.25 శాతం నుంచి 5.67 శాతానికి పడిపోయింది. ఆ రాష్ట్ర ర్యాంకు కూడా 4వ స్థానం నుంచి 6వ స్థానానికి దిగజారింది.
ఇటీవల విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు -2026 ను విజవంతంగా నిర్వహించింది. ఈ సదస్సుకు పేరొందిన పారిశ్రామికవేత్తలు తరలివచ్చి భారీ పెట్టుబడులతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో మొత్తం 303 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రానికి 9,88,957 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా సుమారు 3,48,309 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ తో కలిసి ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు చెప్పుకుంటున్నారు.
This post was last modified on November 21, 2026 9:12 am
పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…
పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…
పరిటాల రవి, పరిటాల సునీతల వారసుడు, టీడీపీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్.. తాజాగా జరిగిన జిల్లా పరిషత్.. చైర్మన్ ఎంపికలో…
బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని…
ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు…