బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్‌కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అనే బిరుదు ఊరికే రాలేదు. హీరో అంటే సెట్లోకి రావడం, నటించి వెళ్లిపోవడం అని కాకుండా.. సినిమాకు సంబంధించి క్రియేటివ్ ప్రాసెస్, మేకింగ్ అన్నింట్లోనూ భాగమవుతూ బెస్ట్ ఔట్ పుట్ తీసుకకురావడానికి అతను పడే తపన ప్రశంసనీయం. ‘లగాన్’ దగ్గర్నుంచి ‘దంగల్’ వరకు ఆమిర్ అలాంటి ఇన్వాల్వ్‌మెంట్‌తోనే సెన్సేషనల్ హిట్లు కొట్టాడు.
సినిమాలో తన పాత్రే హైలైట్ కావాలనే రకం కాదు ఆమిర్. మిగతా పాత్రలకు కూడా తగు ప్రాధాన్యం ఉండేలా, అవీ హైలైట్ అయ్యేలా చూసుకుంటాడు. క్రియేటివ్ సైడ్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అవుతూ.. తన సినిమాల్లో అన్ని పాత్రలూ ఎలివేట్ అయ్యేలా.. భావోద్వేగాలు సరిగ్గా పండేలా అతను చూసుకుంటాడు. ఈ విషయంలో ఆమిర్ నైపుణ్యం ఎలాంటిదో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సౌత్ స్టార్ సిద్దార్థ్ వెల్లడించాడు.
సిద్ధు.. ఆమిర్ ఖాన్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘రంగ్ దె బసంతి’లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్ర స్టన్నింగ్‌గా ఉంటుంది. అప్పటికి కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సిద్ధు.. ఆమిర్ లాంటి పెద్ద హీరో సినిమాలో అతణ్ని డామినేట్ చేసే పాత్రలో నటించాడు. క్లైమాక్స్‌లో ఆమిర్‌ను మించి సిద్ధు పాత్రనే హైలైట్ అవుతుంది. రేడియో స్టేషన్లో స్పీచ్ ఇచ్చే సీన్లో నిజానికి ముందు అనుకున్న ప్రకారం మిత్ర బృందంలోని ఐదుగురూ మాట్లాడాల్సి ఉందట. ఐతే ఆమిర్ ఈ సన్నివేశాన్ని అప్పటికప్పుడు మార్చేశాడట. అందరూ మాట్లాడితే ఈ సన్నివేశం పండదని.. సిద్ధు పాత్రే స్పీచ్ ఇవ్వాలని చెప్పాడట.
దీంతో ఒక రాత్రంతా కూర్చుని దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఆ సన్నివేశాన్ని మార్చి రాశారని సిద్ధు గుర్తు చేసుకున్నాడు. ఒక పాత్రే అక్కడ స్పీచ్ ఇవ్వాలంటే మెయిన్ హీరో ఆమిరే కాబట్టి.. ఆ పాత్రతోనే ఆ పని చేయించొచ్చు. కానీ అక్కడ సిద్ధు పాత్ర మాట్లాడితేనే సన్నివేశం పండుతుందని తను హైలైట్ కావాలని చూడకుండా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం ఆమిర్ గొప్పదనానికి నిదర్శనం. ఈ మధ్య సరైన విజయాలు లేక ఆమిర్ కొంచెం వెనుకబడ్డాడు కానీ.. ఆమిర్ లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి కళాఖండాలతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే గొప్ప హీరోల్లో ఒకడిగా నిలిచాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates