Movie News

అపార్థాలకు దారి తీసిన నాని మాటలు

ఒక్కోసారి హీరోలకు తమకు తెలియకుండా ఒక ఉద్దేశంతో అన్న మాటలు ఇంకో కోణంలో వెళ్ళిపోయి సోషల్ మీడియాలో రచ్చకు అవకాశాన్ని ఇస్తాయి. నిన్న చెన్నైలో జరిగిన ప్యారడైజ్ ప్రెస్ మీట్ లో నాని తమిళ సినిమాను బైబిల్ తో పోలుస్తూ కోలీవుడ్ ని ఆకాశానికి ఎత్తేయడం వివిధ చర్చలకు దారి తీస్తోంది. మణిరత్నం, భారతీరాజా, భాగ్య రాజ్ లాంటి లెజెండరీల ప్రస్తావన మంచిదే కానీ అంతా అక్కడి నుంచే నేర్చుకున్నాననే స్థాయిలో ఎలివేషన్ ఇవ్వడం నెటిజెన్లకు అంతగా నచ్చడం లేదు.

మాములుగా మల్టీ లాంగ్వేజ్ ప్రమోషన్లకు వెళ్ళినప్పుడు ఆయా పరిశ్రమల గొప్పదనం గురించి మనోళ్లు కొంచెం చెప్పడం ఎన్నోసార్లు చూశాం. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈవెంట్ లో సూర్య అన్న మాటలు మర్చిపోలేంగా. కానీ ఇక్కడ చిక్కల్లా ఎలాంటి పదాలు వాడుతున్నాం అనే దగ్గర వస్తుంది. బైబిల్ అనడం, చెన్నై వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పడం సగటు సినీ ప్రియులు అంగీకరించలేకపోతున్నారు.

అయితే నాని మాటలను మరీ భూతద్దంలో చూస్తున్నారని అభిమానులు డిఫెండ్ చేస్తున్నారు. వెళ్ళింది చెన్నై కాబట్టి కమల్ హాసన్ లాంటి వాళ్ళ ప్రస్తావన తీసుకురావడంలో తప్పేముందని కౌంటర్ ఇస్తున్నారు. రాజమౌళి కన్నా చాలా ముందు సౌత్ స్టాండర్డ్స్ ని శంకర్, మణిరత్నం లాంటి వాళ్ళు పెద్ద స్థాయికి తీసుకెళ్లారని, అలాంటప్పుడు అనవసరంగా లేనిపోని విశ్లేషణలతో ఎందుకు మన హీరోని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని వివరిస్తున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా నానికి టాలీవుడ్ మీద ఉన్న అపారమైన గౌరవం గురించి కొత్తగా సర్టిఫికెట్లు అవసరం లేదనేది ఫ్యాన్స్ వాదన. అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టే స్టేజి నుంచి వంద కోట్ల మార్కెట్ సాధించిన స్టార్ హీరోగా నాని ప్రతి అడుగు తెలుగులోనే పడిందనేది నిజం. తమిళంలో రెండు స్ట్రెయిట్ సినిమాలు చేసినా అవి డిజాస్టరయ్యాయి. ఇదే ప్రెస్ మీట్ లో నానినే దీన్ని ఒప్పుకున్నాడు. డబ్బింగ్ అయితేనే వర్కౌటవుతాయని అన్నాడు. చూడాలి మరి ఈ డిబేట్లు ఎక్కడి దాకా వెళ్తాయో.

This post was last modified on September 18, 2026 2:27 pm

Share

Recent Posts

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

59 minutes ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

1 hour ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

4 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

7 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

7 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

8 hours ago