Trends

16 ఏళ్ల బాలిక మర్డర్.. నలుగురు టీనేజర్లు అదుపులో!

ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కాగా, మరొకరికి 19 ఏళ్లు. తనకు తెలిసిన 17 ఏళ్ల బాలుడిని కలవడానికి వెళ్లిన తర్వాతే బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం బాలిక శుక్రవారం రాత్రి ఆ బాలుడిని కలిసేందుకు వెళ్లింది. అతడు తన స్నేహితులతో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయట చెబుతానని బాలిక చెప్పడంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఆదివారం ఉదయం స్వరూప్‌నగర్‌లోని కుషక్ రోడ్ సమీపంలోని పొలంలో బాలిక మృతదేహం కనిపించింది. అప్పటికే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో మొదట ఆమె ఎవరనేది కూడా పోలీసులకు తెలియలేదు. పోస్టుమార్టంలో లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో హత్య, అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని 50కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఒక కెమెరాలో అనుమానాస్పదంగా కనిపించిన టెంపో ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్లింది. ఆ వాహనాన్ని గుర్తించిన తర్వాత అందులో నలుగురు యువకులు ప్రయాణించినట్లు మరో ఫుటేజ్‌లో కనిపించింది. చివరకు టెంపోను గుర్తించి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో రెండు కత్తులతో పాటు నిందితులు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. బాలికపై దాడి ఎక్కడ జరిగింది, హత్యకు ముందు ఏం జరిగింది, నలుగురిలో ఎవరి పాత్ర ఏమిటనే విషయాలను ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.

This post was last modified on September 18, 2026 2:19 pm

Share

Recent Posts

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

2 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

2 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

3 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

3 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

4 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

5 hours ago