అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది. తమిళనాడు సిఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వ తెరంగేట్రంగా రూపొందిన ఈ హీస్ట్ థ్రిల్లర్ కు తమన్ సంగీతం సమకూర్చగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ టీమ్ బోలెడు విశేసలు పంచుకోవడంతో పాటు వీలైనంత వరకు హైప్ తెచ్చే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా సందీప్ వైపు నుంచే పుష్ కనిపించింది.
సిగ్మాకున్న ప్రధాన సమస్య ఏమిటంటే విజయ్ కి మన దగ్గర ఎంత ఇమేజ్ ఉన్నా అతని కొడుకు డైరెక్షన్ అంటే ఎగబడి చూసేంత ఫాలోయింగ్ అయితే లేదు. కాకపోతే తెలుగువాడైన సందీప్ కిషన్ హీరో కాబట్టి ఆడియన్స్ లో ఆసక్తి అయితే నెలకొంటుంది. రాబోయే రెండు వారాలు ప్రమోషన్లు ఎలా చేస్తారు, ట్రైలర్ ఎలా ఉండబోతోందనే దాని మీద ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. తమిళనాడులో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు విజయ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారట.
నటుడి కన్నా ముందు దర్శకుడిగా ప్రూవ్ చేసుకునే ఉద్దేశంతో జేసన్ సంజయ్ మెగా ఫోన్ చేపట్టాడు. కుర్రాడికి తెలుగు సినిమాల మీద అవగాహన ఉంది. టాలీవుడ్ మీడియా ఫేవరెట్ మూవీస్ ఏవని అడిగితే మర్యాద రామన్న, ఖలేజా అన్నాడు తప్పించి రొటీన్ గా బాహుబలి, సలార్ పేర్లు చెప్పలేదు. దీన్ని బట్టి ఫిలిం మేకింగ్ సెన్సిబిలిటీస్ మీద తన టేస్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్టేజి మీద సందీప్ కిషన్ తో కలిసి జేసన్ డాన్సు కూడా చేయడం ఆహుతులను ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమాకు కలిసి వస్తున్న మరో అంశం తీవ్రమైన పోటీ లేకపోవడం. ఫహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఇటీవలే పబ్లిసిటీ మొదలుపెట్టింది. సమర్పిస్తుంది రాజమౌళి కాబట్టి రిలీజ్ నాటికి సౌండ్ పెరిగేలా ఉంది. తెల్ల కాగితం అనే మరో చిన్న సినిమా రేస్ లో ఉంది. తమిళంలో డిమాంటీ కాలనీ 3 నుంచి కాంపిటీషన్ ఉంటుందని చెన్నై మీడియా అంచనా వేస్తోంది. బాలీవుడ్ నుంచి దృశ్యం 3 ది కంక్లూజన్ వస్తోంది. మొత్తానికి వాతావరణం చూస్తే సిగ్మా సౌండ్ ఇంకొంచెం పెంచాల్సిందే అనేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates