గత నాలుగు రోజులుగా మెగాభిమానుల మధ్య జరుగుతున్న డిస్కషన్ ఒకటే. సంక్రాంతికి విశ్వంభర, కాకాలో ఏది విడుదలవుతుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్, దర్శకుడు బాబీ కొల్లిలు జనవరి 13 వస్తున్నామని మరోసారి అఫీషియల్ గా చెప్పిన సంగతి తెలిసిందే. వశిష్ఠ ఏమో అంతా శివయ్య చూసుకుంటాడని అర్థం వచ్చేలా ఒక వీడియో, చిన్న స్తోత్రం పెట్టడంతో దాని మీద ఎడతెగని చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
ఎవరికి వారు పట్టుదలగా ఉండటంతో చిరంజీవిని సైతం సంకటంలో పడేసిందని సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఒకవేళ దీన్ని పరిష్కరించడం సాధ్యం కాకపోతే ఒకేసారి లేదా తక్కువ గ్యాప్ తో రెండు సినిమాలు విడుదలైతే ఎలానే దాని గురించి రకరకాల విశ్లేషణలు వస్తున్నాయట. గతంలో బాలయ్యకు ఈ ఇరకాటం వచ్చింది. సమస్యని పరిష్కరించేలేని స్టేజికు చేరుకోవడంతో బంగారుబుల్లోడు, నిప్పురవ్వ ఒకేరోజు రిలీజ్ చేశారు. వాటిలో రెండోది ఫ్లాప్ అయ్యింది.
తర్వాత న్యాచురల్ స్టార్ నాని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు ఒకేరోజు థియేటర్లకు వచ్చాయి. ఫలితం బాలకృష్ణదే వచ్చింది. ఒకటి హిట్టు ఒకటి ఫట్టు. శ్రీవిష్ణు కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడు. మృత్యుంజయ్, విష్ణువిన్యాసం ఒకే డేట్ వేసుకుంటే కిందా మీదా పడి ఒకదాన్ని వారం ఆలస్యంగా తీసుకొచ్చారు. రెండో ఫ్లాప్ కావడం వేరే విషయం. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ తరహా అనుభవాలు ఎన్నో చవి చూశారు.
ఇప్పుడు చిరంజీవి తక్షణ కర్తవ్యం ఏమిటనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. కాకా అప్డేట్ గురించి వచ్చిన ఫోటో ట్వీట్ లో తమ నిర్మాత కూడా ఉండటం పట్ల యువి క్రియేషన్స్ ఒకింత కోపంగానే ఉందట. తమ అంగీకారం తీసుకుని డేట్ కన్ఫర్మ్ చేసినట్టు ఉందని ఆఫ్ రికార్డు చెబుతున్నారట. ప్రాక్టికల్ గా అయితే చిరు రెండు సినిమాలు క్లాష్ అవ్వడం జరగని పనిగానే కనిపిస్తోంది. అనూహ్యంగా పరిస్థితులు కనక దానికి ప్రేరేపిస్తే మటుకు ఊహకందని బాక్సాఫీస్ యుద్ధం చూడొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates