ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే ఆదరణ పొందింది. దర్శకుడు ఆర్జె బాలాజీకి సూర్య లాంటి స్టార్ తో అవకాశం వచ్చేలా చేసింది ఈ మూవీనే. దెబ్బకు కరుప్పు రూపంలో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూకుతి అమ్మన్ రెండో భాగం ఇప్పుడు సిద్ధం అవుతోంది. అయితే దర్శకత్వ బాధ్యతలు సుందర్ సి తీసుకున్నారు. బడ్జెట్ వంద కోట్లని చెన్నై టాక్.
ఇవాళ టీజర్ వచ్చింది. కాన్సెప్ట్ పరంగా మరీ కొత్తగా అనిపించలేదు కానీ టాపిక్ అది కాదు. ఏఐని విపరీతంగా వాడేసిన వైనం విజువల్స్ లో కనిపిస్తోంది. ఈ మధ్య ప్రేక్షకులు బాగా తెలివి మీరిపోయారు. జెమిని, చాట్ జిపిటి లాంటివి వాడుతూ చాలా అడ్వాన్స్ అవుతున్నారు. ఇలాంటి ట్రెండ్ లో దర్శక నిర్మాతలు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా దొరికిపోవడం ఖాయం. మూకుతి అమ్మన్ 2 అలియాస్ మహాశక్తి విషయంలో సినీ ప్రియులు ఈ విధంగానే రియాక్ట్ అవుతున్నారు.
ఒక తెగలో పెరుగుతున్న పసిబిడ్డను ఎత్తుకెళ్లడానికి రాక్షస గణం బయలుదేరుతుంది. ఆ పాప తల్లి ప్రాణ త్యాగం చేశాక మహా శక్తి అమ్మవారు స్వయంగా దిగి వస్తుంది. దీని ముందు తర్వాత ఏం జరిగిందనేది దీపావళి పండక్కు థియేటర్లలో చూడాలి. స్పష్టంగా ఏఐతో చేశారు అనిపించేలా సహజత్వానికి దూరంగా ఉన్న విఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమనిపిస్తోంది. ఇది టీజర్ కోసం అలా చేశారో లేక ఒరిజినల్ కంటెంట్ అలా ఉందో సినిమా చూశాక క్లారిటీ వస్తుంది.
నవంబర్ మొదటి వారం విడుదలకు రెడీ అవుతున్నట్టు టీజర్ లో చెప్పేశారు. అంటే రామాయణతో పాటు సూర్య సీన్, ధనుష్ ఓమ్ లతో మహాశక్తి పోటీ పడాల్సి ఉంటుంది. నయనతారకు టాక్సిక్ నిరాశ పరిచినా మిక్స్డ్ రివ్యూలతో హాయ్ డీసెంట్ వసూళ్లు సాధించడం ఊరట కలిగించింది. అయితే మహాశక్తి పూర్తిగా తన మీద నడిచే కథ కాబట్టి విజయవంతమైతే మార్కెట్ మరింత పెరుగుతుంది. దీనికి ధృవ ఫేమ్ హిప్ హాప్ తమిజ సంగీతం సమకూర్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates