మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే ఒకరకంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మరో వీకెండ్ వసూళ్లు రవితేజ కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. నిన్న చివరి ఈవెంట్ జరిపిన మైత్రి టీమ్ తమ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు షీల్డులు అందజేసి సంతోషాన్ని పంచుకుంది. హీరో రవితేజతో సహా టీమ్ మొత్తం పాల్గొని తమ ఆనందాన్ని మరోసారి వ్యక్తపరిచారు.
తాజాగా చాలా కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో వాటి ప్రభావం థియేటర్ కౌంటర్ పరంగా ఇరుముడి మీద ఉంది. అలాని మొత్తానికి ఏ సెంటర్లోనూ ఈ మూవీని తీసేయలేదు. ప్రధాన కేంద్రాల్లో కనీసం నాలుగు నుంచి ఎనిమిది షోల దాకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని కేంద్రాలు యాభై రోజుల సంబరానికి రెడీ అవుతున్నాయి. ఒప్పందం ప్రకారం త్వరలోనే ఓటిటి స్ట్రీమింగ్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో నిర్మాణ సంస్థ వైపు నుంచి థియేటర్ ప్రమోషన్లు ఉండకపోవచ్చు.
గత ఇరవై రోజుల పరిణామాలు గమనిస్తే ఇరుముడి స్థాయిలో లేదా దాన్ని దాటేలా ఏ ఒక్క సినిమా యునానిమస్ గా పాజిటివ్ అనిపించుకోలేదు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఇప్పటికీ రవితేజకే పట్టం కడుతున్నారు. తొలి రోజుల రష్ వల్ల మిస్ చేసుకున్న పెద్ద వాళ్ళు, ఫామిలీస్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇంకా పొటెన్షియాలిటీ అయిపోలేదు. రెండు వందల యాభై కోట్ల మార్కుని దాటడం కష్టమే కానీ అసాధ్యం కాదనేది వసూళ్లను చూస్తే అర్థమవుతుంది.
ఏదైతేనేం ఇండస్ట్రీలో ఇరుముడి ఒక ఆక్సీజెన్ లా పని చేసింది. ప్యాన్ ఇండియా ఉచ్చులో పడకుండా ఒక తెలుగు నేటివిటీ కథతోనూ అద్భుతాలు చేయొచ్చని దర్శకుడు శివ నిర్వాణ నిరూపించారు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈపాటికి ఒకటో రెండు షెడ్యూల్స్ అయిపోవాల్సిన రవితేజ కొత్త సినిమాల వరస క్రమం మారడమే కాదు స్క్రిప్టులు కూడా మరోసారి చెకింగ్ లో పడ్డాయి. ఈ విజయాన్ని కొనసాగించడానికి రవితేజ డబుల్ ఎనర్జీతో పని చేస్తాడని చెప్పడంలో డౌట్ లేదు.
This post was last modified on September 11, 2026 9:53 am
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…