ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్ మెంట్. సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయాలని కంకణం కట్టుకుంటే చాలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ కాకుండా అనుకున్న టార్గెట్ ప్రకారం ప్లానింగ్ మిస్ కాకుండా చూసుకుంటారు. ఆదర్శ కుటుంబంలో బిజీగా ఉన్న వెంకటేష్ ని ఒప్పించి ఆల్రెడీ జనవరి 12 విడుదల షూటింగ్ అరవై శాతం పైగా పూర్తి చేయడం మాములు విషయం కాదు.
ఇక్కడితో అయిపోలేదు. తెలియకుండా జరిగినా, కావాలని చేసినా ఏదో ఒక రూపంలో కంటెంట్ లీక్ కావడం వల్ల కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతోంది. ఇటీవలే పాట షూట్ తాలూకు విజువల్స్ వీడియోగా బయటికి వచ్చాయి. ఆర్టిస్టులందరూ స్పష్టంగా కనిపించారు. తాజాగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఫస్ట్ హాఫ్ చూశానని, అదిరిపోయిందని ట్వీట్ వేశారు. అంటే రీ రికార్డింగ్ ఎక్కడి దాకా వచ్చిందో మ్యూజిక్ డైరెక్టర్ తో చెప్పించడం ద్వారా అనిల్ స్ట్రాటజీ ఏంటో అర్థమయ్యింది.
ఇంత ప్రణాళికతో వేరే ఏ సంక్రాంతి సినిమా లేదనేది వాస్తవం. చిరంజీవి కాకా స్పీడ్ గా ఉన్నప్పటికీ హైలైట్ కావాల్సిన విషయంలో జనవరి 12 విడుదల కన్నా కొంచెం వెనుకబడే ఉంది. సంబరాల ఏటిగట్టు సౌండ్ లేదు. మహాకాళీ ఇంకా అసలు పని మొదలుపెట్టలేదు. శర్వానంద్ జార్జ్ క్రిష్ ఇటీవలే ప్రారంభమయ్యింది కాబట్టి అప్డేట్స్ ఆశించలేం. శ్రీవిష్ణు టీమ్ తమ రిలీజ్ గురించి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఇలా అందరికీ ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది.
సెప్టెంబర్ మినహాయిస్తే ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఎవరికి దొరకనంత టైం అనిల్ రావిపూడికి దక్కనుంది. పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేస్తే డిసెంబర్ మొత్తం ప్రమోషన్లు చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండకుండా తన సినిమాని జనాలకు దగ్గర చేయాలంటే ఎంత చేయాలో అంత కన్నా ఎక్కువే చేస్తారు రావిపూడి. రెండు జంటల కామెడీ తెరమీద ఓ రేంజ్ లో పండిందనే టాక్ యూనిట్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
This post was last modified on September 11, 2026 10:10 am
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నోటి…
అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్…
ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నానని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి తాజాగా మరో…
ఏపీ అసెంబ్లీ స్పీకర్.. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబానికి మరో కీలక పదవి చిక్కింది. ఇప్పటికే…
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు…
తన బుర్రకథ, పాటలతో 80, 90 దశకాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆ…