Movie News

దాచిపెట్టిన ప్ర‌భాస్‌ను చూపించారు

సినిమా షూటింగ్ చేశామా.. ఆ ప‌ని అవ్వ‌గానే ప‌ర్స‌న‌ల్ స్పేస్‌లోకి వెళ్లిపోయామా అన్న‌ట్లుండే హీరో ప్ర‌భాస్. పాన్ ఇండియా స్థాయిలో సూప‌ర్ స్టార్‌గా అవ‌త‌రించినా.. మీడియాలో క‌నిపించాల‌నే తాప‌త్ర‌యం ఎంత‌మాత్రం లేకుండా త‌న స్పేస్‌లో తానుంటాడు రెబ‌ల్ స్టార్. కానీ అభిమానుల‌కేమో అత‌ను రెగ్యుల‌ర్‌గా బ‌య‌టికొస్తే చూడాల‌ని.. సినిమా ఈవెంట్ల‌లో పాల్గొనాల‌ని కోరిక‌గా ఉంటుంది. కానీ ప్ర‌భాస్ ఏమో సిగ్గ‌రి. ఎప్పుడో కానీ.. బ‌యటికి రాడు. త‌న లుక్ చూపించ‌డు. త‌న‌కు స‌న్నిహితులైన వ్య‌క్తుల‌కు సంబంధించిన‌ సినిమాలు వేటినైనా ప్ర‌మోట్ చేసినా.. సోషల్ మీడియా పోస్టుల వ‌ర‌కే ఉంటుంది. ఈవెంట్ల‌కు రావ‌డం అరుదు.

ఐతే తన‌తో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా రోమాంచ‌కం కోసం ప్ర‌భాస్ కొంచెం ఎక్కువ ఎఫ‌ర్టే పెట్టాడు. రోమాంచ‌కం టీంను క‌లిశాడు. ట్రైల‌ర్ చూశాడు. వాళ్ల‌తో క‌బుర్లు చెప్పాడు. కావాల్సిన స‌పోర్ట్ ఇచ్చాడు. ఐతే ఈ చిత్ర హీరో సుమంత్ ప్ర‌భాస్‌ను క‌లిసిన వీడియో ఒక‌టి టీం రిలీజ్ చేయ‌గా.. అందులో ప్ర‌భాస్ ముఖం చూపించ‌క‌పోవ‌డంతో అభిమానులు బాగా ఫీల‌య్యారు.

మ‌రీ ఇంత దాప‌రికం ఏంటి.. ఫౌజీ లుక్‌ను దాస్తున్నారా, లేక ప్ర‌భాస్ మెయింటైనెన్స్ స‌రిగా లేదా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. ఐతే ఈ చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే.. రోమాంచ‌కం టీం ప్ర‌భాస్‌ను క‌లిసిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చేశాయి. టీం అందరితో కూర్చుని రోమాంచ‌కం ట్రైల‌ర్ చూసిన ఫొటోల‌తో పాటు.. హీరో సుమంత్ ప్ర‌భాస్‌కు హ‌గ్ ఇచ్చి అతడి ష‌ర్టు మీద విషెస్ రాసిన ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

రాజాసాబ్ టైంలో కంటే ప్ర‌భాస్ ఇందులో చాలా మెరుగ్గా, ఆరోగ్య‌క‌రంగా క‌నిపిస్తున్నాడు. ఐతే ప్ర‌భాస్ కొంచెం ఎక్కువ స‌న్న‌బ‌డ‌డంతో ముఖంలో కాస్త డ‌ల్‌నెస్ క‌నిపిస్తోంది. కానీ ఓవ‌రాల్‌గా ప్ర‌భాస్ ప్లెజెంట్ లుక్‌లో ఉండ‌డం అభిమానుల‌కు ఉత్సాహాన్నిస్తోంది. ప్ర‌భాస్ కొన్ని వారాల కింద‌టే స్పిరిట్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని ఫౌజీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న నేప‌థ్యంలో లేటెస్ట్ లుక్ ఆ సినిమాకు సంబంధించిన‌దే అని భావిస్తున్నారు. ఫౌజీ డిసెంబ‌రు 3న రిలీజ్ కావాల్సి ఉండ‌గా.. స్పిరిట్ వ‌చ్చే ఏడాది మార్చి రిలీజ్‌కు షెడ్యూల్ అయింది. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టిదాకా 40 శాతం పూర్త‌యింది.

This post was last modified on September 3, 2026 7:48 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

2 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

7 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

9 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

9 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

11 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

12 hours ago