ఈ వారం కొత్త సినిమా భోగిని టీమ్ గట్టిగా ప్రమోట్ చేస్తూ వస్తోంది కొన్ని రోజులుగా. ఐతే ఈ సినిమా ఈవెంట్లలో, ఇతర ప్రమోషన్లలో ఎక్కడా లీడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలుగులో ఈ సినిమా చేసినా ప్రమోషన్లకు బాగా సహకరిస్తుంది అనుపమ. గత నెలలో క్రేజీ కళ్యాణంను కూడా బాగా ప్రమోట్ చేసింది. కానీ భోగి సినిమాను మాత్రం పట్టించుకోలేదు.
ఈవెంట్లకు హాజరు కాకపోవడమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఒక పోస్టు కూడా పెట్టలేదు అనుపమ. ఓవైపు సెకండ్ హీరోయిన్ అయిన డింపుల్ హయాతి అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేస్తుంటే మెయిన్ హీరోయిన్ అనుపమ మాత్రం ఎందుకిలా మౌనంగా ఉంటోంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ఈ చర్చకు ముగింపు పలుకుతూ అనుపమ స్పందించింది.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భోగి రిలీజ్ గురించి అనుపమ పోస్టు పెట్టింది. ఈ సినిమా రిలీజ్ డేట్లు పలుమార్లు మారడంతో తన డేట్లను సర్దుబాటు చేయడానికి ఎంతో ప్రయత్నించానని.. అయితే ముందుగా ఒప్పుకున్న మరో సినిమా షూటింగ్ కోసం తాను ఊటీకి వెళ్లాల్సి రావడంతో ప్రమోషన్లకు హాజరుకాలేకపోయానని వివరించింది.
ఈ నేపథ్యంలో తన పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించిన ‘భోగి’ చిత్ర బృందానికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది. తాను భౌతికంగా అక్కడ లేకపోయినా తన మనసు ఎప్పుడూ చిత్ర యూనిట్తోనే ఉంటుందని ఆమె పేర్కొంది. ఐతే ఈ సంగతి కొంచెం ముందే చెప్పి ఉంటే ఊహాగానాలకు అవకాశం లేకపోయేది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని రాధామోహన్ నిర్మించారు.
This post was last modified on November 27, 2026 3:36 pm
రెబెల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ ఏప్రిల్, స్పిరిట్…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ దాకా తీసింది అతి…
టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త పేరు బాగా హల్చల్ చేస్తోంది. ఆకాశంలో ఒక తార అంత పోటీలో విజయం సాధించడం…
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్…
ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ప్రదానానికి రంగం సిద్ధమైంది. 2017 నుంచి అవార్డుల…
బుల్డోజర్ యాక్షన్ తో దేశంలో క్రేజ్ తెచ్చుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు మూడోసారి సీఎం ఛాన్స్…