Trends

లింగమార్పిడి తరువాత ఆట తీరు మారింది

మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన అనయా బంగర్, జెండర్ ట్రాన్సిషన్ తర్వాత మహిళగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహిళల ప్రొఫెషనల్ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అక్కడ కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు అర్హత లభించింది.

ట్రాన్స్‌జెండర్ మహిళ అయిన అనయా 2024లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించారు. ట్రాన్సిషన్ తర్వాత తన శరీరంలోనే కాదు, ఆటలో కూడా ఎలాంటి మార్పులు వచ్చాయో ఇటీవల వివరించారు. తనకు కుటుంబం అండగా ఉన్నప్పటికీ, పెద్ద పోరాటాలు మాత్రం తానే ఎదుర్కొన్నానని చెప్పారు. హార్మోన్ థెరపీ మొదలైన తర్వాత స్టామినా, మసిల్ మాస్‌తో పాటు బోన్ మినరల్ డెన్సిటీ కూడా తగ్గిందని తెలిపారు.

టెస్టోస్టెరాన్ సప్రెసెంట్స్, ఈస్ట్రోజెన్ తీసుకోవడంతో శరీరంలో రెండోసారి ప్యూబర్టీ తరహా మార్పులు వస్తాయని అనయా తన అనుభవాన్ని వివరించారు. సర్జరీ కూడా చేయించుకున్నట్లు చెప్పారు. బలం తగ్గడంతో తన ఆటతీరు కూడా మారిందని, ప్రస్తుతం టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 ఎన్ఎంఓఎల్/ఎల్‌గా ఉందని వెల్లడించారు. అథ్లెట్‌గా తన సామర్థ్యంపైనా దీని ప్రభావం పడిందని చెప్పారు.

ఇంగ్లండ్‌లో ఉన్న సమయంలో మాంచెస్టర్ యూనివర్సిటీతో జరిగిన ఓ అధ్యయనంలో కూడా అనయా పాల్గొన్నారు. 12 వారాల పాటు లంగ్ కెపాసిటీ, హిమోగ్లోబిన్, పవర్ అవుట్‌పుట్ సహా పలు అంశాలను పరీక్షించినట్లు చెప్పారు. ఆ ఫలితాలను మహిళా అథ్లెట్ల డేటాతో పోల్చగా, తన రిజల్ట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇక 2027 మార్చిలో మరోసారి పరీక్షల తర్వాత ఎలైట్ మహిళల క్రికెట్‌లో అవకాశం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోనుంది.

ఇక అనయా లక్ష్యం భారత్ తరఫున ఆడటమే. మహిళల క్రికెట్‌లో భారత్‌కు వరల్డ్ కప్ అందించాలని, ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో విరాట్ కోహ్లీని ఎక్కువగా అభిమానించేవారినని, ఇప్పుడు అభిషేక్ శర్మ ఆట నచ్చుతుందని తెలిపారు. మహిళా క్రికెటర్లలో స్మృతి మంధాన తన ఫేవరెట్ అని, గతంలో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి కూడా క్రికెట్ ఆడినట్లు చెప్పారు.

This post was last modified on September 3, 2026 10:09 am

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

12 minutes ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

5 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

9 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

11 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

12 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

14 hours ago