Movie News

ముగింపుకు వచ్చిన టాక్సిక్ కథ ?

ఉత్తరాది, కర్ణాటక రాష్ట్రాల సంగతేమో కానీ తెలుగులో టాక్సిక్ కథ దాదాపు ముగింపుకు వచ్చినట్టే. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే థియేటర్లు గణనీయంగా తగ్గిపోవడం ఒక కారణమైతే, డిజాస్టర్ టాక్ లో ఎలాంటి మార్పు లేకపోవడం, సోషల్ మీడియా మద్దతు కనిపించకపోవడం డ్యామేజ్ పెంచాయి. ఘాటుగా రివ్యూలు చేసిన వాళ్లకు లీగల్ నోటీసులు పంపించిన కెవిఎన్ సంస్థ దాని వల్ల దక్కించుకున్న ప్రయోజనం దాదాపు సున్నానే. ఆ ప్రభావం కలెక్షన్లకు దోహదపడలేదు.

బుక్ మై షోలో ట్రెండింగ్ కనిపిస్తోంది కానీ అది ప్రధానంగా బెంగళూరుతో పాటు ముంబై లాంటి నగరాల నుంచి నమోదైన బుకింగ్స్ గా అర్థమవుతోంది. హిందీ మాస్ జనాలు ఓ మోస్తరుగా మొదటి వారంలో చూశారు కానీ తర్వాత ఎలాంటి పికప్ లేకపోయింది. మూడుంపావు గంటల నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో కానీ ప్రొడక్షన్ టీమ్ నుంచి అలాంటి సూచనలు కనిపించలేదు. ఫలితం ఎలా ఉన్నా సక్సెస్ మీట్ లాంటిది చేస్తారేమోనని ఎదురు చూసిన యష్ ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది.

టాక్సిక్ తెలుగు వెర్షన్ కు సంబంధించిన గ్రాస్ లెక్కలు బయటికి రాలేదు. అధిక శాతం ఏరియాలలో ఫస్ట్ వీకెండ్ లోనే డెఫిషిట్లు పడటంతో బయ్యర్స్ నుంచి నెంబర్స్ తెలియకుండా పోయాయి. మరో వారాంతం వస్తోంది కానీ టాక్సిక్ కి దారులు కనిపించడం లేదు. రోమాంచకం, ఐ యాం గేమ్, రంభ ఊర్వశి మేనక, మీర్జాపూర్ లాంటి కొత్త రిలీజులతో పాటు ఇరుముడి మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉండటం బాక్సాఫీస్ పరంగా సానుకూలంగా కనిపిస్తున్న అంశాలు.

ఇక యష్ విషయానికి వస్తే టాక్సిక్ తర్వాత మళ్ళీ బయట కనిపించలేదు. రిజల్ట్ అర్థమైపోవడంతో వీడియో బైట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తల్లి పుష్ప ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఇంకేం జరగలేదు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సైతం మీడియా ముందుకు వచ్చేందుకు సుముఖంగా లేరు. దీని సంగతి పక్కన పెడితే త్వరలో ప్రారంభం కానున్న రామాయణ ప్రమోషన్లకైతే యష్ హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడైనా టాక్సిక్ ప్రశ్నలు ఎదురుకోక తప్పదు. 

This post was last modified on September 3, 2026 10:56 am

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

3 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

8 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

10 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

10 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

12 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

13 hours ago