Movie News

తొమ్మిదేళ్ళ నంది అవార్డులు ఒకేసారి.. చైర్మన్ గా బాలయ్య

ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ప్రదానానికి రంగం సిద్ధమైంది. 2017 నుంచి అవార్డుల ప్రకటనే లేకపోగా.. ఇప్పుడు 2017 నుంచి 2025 వరకు తొమ్మిదేళ్లకు కలిపి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయబోతున్నారు. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

నంది పురస్కారాలతో పాటు ఏపీ ప్రభుత్వం అందజేసే జాతీయ పురస్కారాలను కూడా ఎంపిక చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఎంపిక కమిటీకి చైర్మన్ గా ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమించడం విశేషం.

ఈ కమిటీ సభ్యులుగా నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ కెమెరామన్ ఎస్.గోపాల్ రెడ్డి సీనియర్ నటి ప్రభ ఎంపికయ్యారు. డిసెంబరులో అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది పురస్కారాలతో పాటు ఏపీ ప్రభుత్వం అందించే జాతీయ సినీ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులను ఇటు ప్రభుత్వం, అటు సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవి. కానీ ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఈ అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. 2014 ప్రత్యేక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2016 వరకు అవార్డులు ఇచ్చింది. తర్వాత ఈ పురస్కారాలు ఆగిపోయాయి. జగన్ ప్రభుత్వం ఈ అవార్డుల గురించి అస్సలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మళ్ళీ అవార్డులు అందించేందుకు ఈ ఏడాది కసరత్తులు మొదలు పెట్టి ఇప్పుడు కార్యాచరణ మొదలు పెట్టింది.

This post was last modified on November 27, 2026 3:34 pm

Share

Recent Posts

చిరు అంటే పవన్ కు ఎంత ప్రేమో..

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్…

23 minutes ago

యోగికి మూడోసారి ఛాన్స్ లేనట్టేనా…?

బుల్డోజర్ యాక్షన్ తో దేశంలో క్రేజ్ తెచ్చుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు మూడోసారి సీఎం ఛాన్స్…

1 hour ago

కూటమి ఐక్యత అవసరమన్న పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో వరసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వెనువెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి.…

1 hour ago

వందేళ్ల చరిత్రకు బ్రేక్.. అమెరికా థాంక్స్ గివింగ్ వేడుకకు ప్రకృతి అడ్డంకి..

అమెరికాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తుఫాను ప్రభావంతో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో వరదలు…

1 hour ago

రాజీ కుదిర్చే భారం చిరంజీవి మీదే

సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల విషయంలో చిరంజీవికి ఎదురవుతున్న సందిగ్దత గురించి నెలరోజులకు పైగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు…

4 hours ago

టామ్ హాంక్స్ మెచ్చిన మహారాజ

గత కొన్నేళ్లలో కోలీవుడ్లోనే కాదు ఇండియన్ సినిమాలోనే అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన…

5 hours ago