సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్ ఛాయలు తమ మీద పడనివ్వకుండా సొంతంగా తమకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. సూర్య పెద్ద స్టార్‌గా వెలుగొందుతున్న టైంలో హీరోగా అరంగేట్రం చేసిన కార్తి.. తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’తోనే తన రూటే సపరేటు అని రుజువు చేశాడు. ఆ తర్వాత అతను ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగాడో, తెలుగులో కూడా ఎలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో తెలిసిందే.
ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సినిమాల్లోకి రావడానికి ముందు కార్తి యుఎస్‌లో జాబ్ చేసేవాడు. సినిమాల్లో నటిద్దామని చెన్నైకి తిరిగి వచ్చినపుడు అతను బాగా లావుగా, ఏమాత్రం హీరో లుక్స్ లేకుండా ఉండేవాడు. కానీ సినిమా కోసం అతను ఎంత కష్టపడి ట్రాన్స్ఫామ్ అయ్యాడో కార్తి కొత్త సినిమా ‘సర్దార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సూర్య వెల్లడించాడు.
యుఎస్ నుంచి వచ్చినపుడు కార్తి బాగా లావుగా ఉండేవాడని.. యుఎస్‌లో రైస్ బ్యాగ్ సైజులు పొటాటో చిప్స్ ఉంటాయని.. చెన్నైకి వచ్చాక కూడా తమ ఇంట్లో సోఫాలో కూర్చుని రైస్ బ్యాగ్ సైజులో చిప్స్ ప్యాకెట్ పెట్టుకుని తింటూ ఉండేవాడని.. అలాంటివాడు ‘పరుత్తి వీరన్’ లాంటి ఓ మంచి అవకాశం లభించగానే, మొత్తం మారిపోయాడని.. షాకింగ్ ట్రాన్స్ఫామ్తో తనను ఆశ్చర్యపరిచాడని.. ఆ తర్వాత ఒక్కో సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని సూర్య అన్నాడు.
కార్తికి, తనకు మధ్య అసలు అసూయ అన్నదే ఉండదని ఈ సందర్భంగా సూర్య చెప్పాడు. చాలామంది తనతో మాట్లాడుతున్నపుడు.. కార్తి గురించి అడుగుతారని, అతడి నటనను అభినందిస్తూ మాట్లాడతారని సూర్య చెప్పాడు. తమ ఇంటికి వచ్చేవాళ్లు కూడా తన కంటే ఎక్కువగా కార్తి కోసమే వస్తారంటూ సూర్య చెప్పడం విశేషం. తమ్ముడు ఎంచుకునే కథలు, పాత్రలు చూసి తనకు గర్వంగా ఉంటుందని సూర్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
This post was last modified on September 2, 2026 8:50 pm
రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన వస్తువులకే రక్షణ లేకపోతే ఎలా? ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే…
భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత రాష్ట్రాలు వున్నాయి. ఇందులో ఏ రాష్ట్రానికి లేని విధంగా తమిళనాడుకు…
ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారెన్ బఫెట్ పేరు వినగానే ఆయన పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలే గుర్తుకొస్తాయి. ఎన్నో…
విహారయాత్రకు వెళ్లినా, ఖరీదైన హోటల్లో బస చేసినా అక్కడి సౌకర్యాలు, భద్రతపై అతిథులు నమ్మకంతో ఉంటారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్‌లో…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చాలా ప్రశాంతచిత్తంతో కనిపించే వ్యక్తి. పబ్లిక్ ఫాట్ ఫామ్స్‌లో ఆయనకు ఆగ్రహం రావడం…
బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. తాజాగా తెలంగాణలో పర్యటించారు. అయితే.. ఈ పర్యటన వెనుక పెద్ద…