Movie News

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. చెవిలో పువ్వులో లాంటి ఫ్లాప్ మూవీతో కెరీర్ మొదలుపెట్టి ప్రేమఖైదితో తానేంటో ఋజువు చేసుకుని, తక్కువ టైంలోనే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్లతో బ్లాక్ బస్టర్ అవకాశాలు దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ తెరంగేట్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఛాన్స్ రావడమే ఆయన ప్రతిభకు కొలమానం.

అలాంటి లెజెండరీ దర్శకుడి వారసులుగా వచ్చిన వాళ్ళలో హీరోగా ఆర్యన్ రాజేష్ నిలదొక్కుకోలేకపోయినా డెబ్యూనే ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేష్ తనదైన బాణీలో దూసుకుపోయాడు. చాలా తక్కువ టైంలో యాభై సినిమాలు పూర్తి చేసిన కథానాయకుడిగా రికార్డు సృష్టించారు. ఈ మధ్య కొన్ని ఫ్లాపులతో నెమ్మదించాడు కానీ లేదంటే తన కోసమే థియేటర్లకు వచ్చే ఫ్యాన్ బేస్ ఇప్పటికీ ఉంది. కాకపోతే సరిగా వాడుకునే దర్శకులే దొరకడం లేదు. అయితే అల్లరి నరేష్ కో జీవిత లక్ష్యం ఉంది.

అది ఎప్పటికైనా దర్శకత్వం చేయడం. తండ్రి పేరు చెడగొట్టకుండా తీయడం ఒక సవాలే. పలు సందర్భాల్లో ఈవివి తీసిన ఆ ఒక్కటి అడక్కు, అలీబాబా అరడజను దొంగలు, అప్పుల అప్పారావు లాంటివి రీమేక్ చేయాలని ఉందని నరేష్ గతంలో చెప్పారు. కానీ కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి దర్శకత్వ కోరికను వెలిబుచ్చుతున్నాడు. నటుడిగా అరవై ఆరు సినిమాలు దాటేసిన అల్లరి నరేష్ వంద మార్కు అందుకోవడం కూడా టార్గెట్ గా పెట్టుకున్నాడు.

నిజంగా ఆకాంక్ష ఉంటే వీలైనంత త్వరగా అది నెరవేర్చుకోవాలి. ఇండస్ట్రీకి నిన్నా మొన్నా వచ్చిన కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ఒక సినిమా మొదలుపెట్టేశాడు. విశ్వక్ సేన్ ఖాతాలో ఆల్రెడీ రెండున్నాయి. రామ్ ఏకంగా భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నాడు. సుధీర్ బాబు కూడా ప్లాన్ లో ఉన్నాడు. తనకన్నా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి అల్లరి నరేష్ కూడా వేగంగా అడుగులు వేయాలి. ఈవివిని గుర్తుకు తేవాలి. తన కొత్త సినిమా రంభ ఊర్వశి మేనక ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది.  

This post was last modified on September 2, 2026 7:01 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

25 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

31 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

46 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago