లోకనాయకుడు కమల్ హాసన్‌ను చూస్తే ఆయనకు 65 ఏళ్ల వయసని అంటే నమ్మడం కష్టం. ఈ వయసులోనూ చాలా ఫిట్‌గా కనిపిస్తారాయన. తన కెరీర్లో ఎప్పుడూ అసలు వయసు కంటే తక్కువగానే కనిపంచాడు కమల్. ఒకప్పుడు తాను ఫిట్నెస్ ఫ్రీక్ అని.. ఫిట్ గా ఉండటం కోసం రోజుకు 14 కిలోమీటర్ల దూరం పరుగులు తీసేవాడినని ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
ఐతే మధ్యలో తనకో యాక్సిడెంట్ జరగడంతో అంత దూరం పరుగెత్తలేని పరిస్థితి వచ్చిందని.. ఇప్పుడు కసరత్తులు కూడా తక్కువే చేస్తున్నానని కమల్ చెప్పాడు. ఐతే ఫిట్నెస్ మీద ఎంత దృష్టిపెట్టినా కూడా.. తాను తిండి విషయంలో అసలేమాత్రం నియంత్రణ పాటించేవాడిని కాదని.. ఒక సందర్భంలో తన తిండి చూసి దిగ్గజ నటుడు శివాజీ గణేషన్ ఆశ్చర్యపోయారని కమల్ గుర్తు చేసుకున్నాడు.
తన జీవితంలో ఒక సినిమాకు అత్యంత కష్టపడింది అంటే.. ‘అభయ్’ కోసమే అని కమల్ వెల్లడించాడు. ఆ సినిమాలో అభయ్ పాత్ర కోసం ముందు సన్నటి లుక్‌లో కనిపించాలని అనుకున్నానని.. కానీ తన మిత్రులు మాత్రం అలా ఉంటే బాగోదని అన్నారని.. దీంతో బరువు పెరగడానికి ప్రయత్నాలు చేశానని కమల్ తెలిపాడు. ఈ క్రమంలో రోజుకు 32 గుడ్లు తిన్నానని.. దీంతో పాటు ఉడికించిన చికెన్ కూడా తీసుకున్నానని.. దీనికి తోడు కసరత్తులు కూడా చేయడంతో భారీకాయుడిగా మారానని చెప్పాడు కమల్.
ఐతే ఆ సినిమా తర్వాత గుడ్లు అంటేనే అసహ్యం పుట్టి ఏడాది పాటు వాటి జోలికే వెళ్లలేదని కమల్ తెలిపాడు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ సొంత కథతో తెరకెక్కిన ‘అభయ్’కి అప్పట్లో ఓ రేంజ్ హైప్ వచ్చింది. కానీ కమల్ ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కమల్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
This post was last modified on May 6, 2020 10:07 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…