రవితేజతో మిగతా దర్శకులు ఫెయిలవుతోన్న టైమ్‍లో డాన్ శీను, బలుపు చిత్రాలతో గోపిచంద్ మలినేని వరుస విజయాలు సాధించాడు. అయితే దర్శకుడిగా అతడి స్థాయిని పెంచేంతగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’తో రవితేజతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. అందులోను రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయిన దశలో గోపిచంద్ మలినేని ఈ హిట్టిచ్చాడు.
థియేటర్లకు మాస్ ప్రేక్షకులను రాబట్టడానికి కావాల్సిన మసాలా అంశాలను దట్టించి పారేసిన గోపిచంద్ మలినేని ఈ విజయంతో తనకు, రవితేజకే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా హెల్ప్ చేసాడు. ఈ విజయంతో అతడికి టాలీవుడ్‍లో డిమాండ్ పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు సినిమా తర్వాత మరో సినిమా వెతుక్కున్నట్టు వున్న గోపిచంద్ కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. టాప్ స్టార్లు బిజీగా వున్నా కానీ మిడ్ రేంజ్ హీరోలు అతడితో పని చేయడానికి ఉత్సాహ పడుతున్నారు.
మాస్ సినిమాలు తీసే వినాయక్, బోయపాటి శ్రీను ఇప్పుడు వెనుక పడడంతో నిఖార్సయిన మాస్ సినిమాలు తీసే దర్శకులకు కొరత వచ్చింది. గోపిచంద్ మలినేని కనుక క్రాక్‍లాగా మరోసారి బాక్సాఫీస్ కిటుకుని క్రాక్ చేసే ఇంకో హిట్టిస్తే ఇక అగ్ర హీరోలు కూడా అతడితో సినిమాకోసం రెడీ అయిపోవాల్సిందే.
This post was last modified on January 15, 2021 11:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…