ఇంకో నాలుగు రోజుల్లో రోమాంచకం విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా వ్యవహరించడంతో యూత్ లో కాసిన్ని అంచనాలైతే నెలకొన్నాయి. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్టుగా రావడం, చాలా విషయాలు పంచుకోవడం సోషల్ మీడియాలో బాగా రీచ్ తెచ్చుకున్నాయి. 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఎంటర్ కు వాసుకి వైభవ్ సంగీతం సమకూర్చారు.
ఒకరకంగా చెప్పాలంటే రోమాంచకంకు బాక్సాఫీస్ దగ్గర మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇరుముడి ప్రభంజనం తర్వాత వచ్చిన సినిమాలేవీ నిలబడలేదు. క్లాసు మాస్ అందరికి అదొక్కటే ఛాయస్ అయిపోయింది. దానికి తగ్గట్టే రెండు వందల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. టాక్సిక్ సంగతి మొదటి రోజే తేలిపోయింది. పది రోజులు టికెట్ హైక్స్ తీసుకున్న నిర్మాతలు దాన్ని అయిదు రోజులకే వదిలేయాల్సి వచ్చింది. నెగటివ్ ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది మరి.
సో కొత్త కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న జనాలకు రోమాంచకం కనక సానుకూలంగా టాక్ తెచ్చుకుంటే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. స్వంత బ్యానర్ మీద తీసిన సినిమా కావడంతో సందీప్ వంగ బ్రదర్స్ ప్రత్యేక శ్రద్ధతో ప్రమోషన్లు చేస్తున్నారు. బోలెడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అవుట్ డోర్ పబ్లిసిటీ చేసుకున్నారు. దర్శకుడు వేణు గోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా బ్రాండ్ లేకపోవడంతో తన పేరు మీదే మార్కెటింగ్ చేస్తున్నారు సందీప్ వంగ. నిన్న వేడుక అందులో భాగంగా జరిగిందే.
నెంబర్ పరంగా పోటీ అయితే ఉంది కానీ రోమాంచకం కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా నిలదొక్కుకోగలదు. సెన్సార్ సమస్య వల్ల రంభ ఊర్వశి మేనక వస్తుందో రాదోననే అనుమానం ఇవాళ తీరనుంది. మలయాళ డబ్బింగ్ బెత్లేహమ్ కుటుంబ యూనిట్ మనోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ తో పాటు సౌండ్ చేయడానికి ట్రై చేస్తున్న సహ ఇప్పుడీ సెప్టెంబర్ మొదటి వారం రేసులో ఉన్నాయి. మరి రోమాంచకం ఈ ఛాన్స్ ఎలా వాడుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
