ఇరుముడి ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఇద్దరికీ మాత్రం దాని వల్ల పూర్తి ప్రయోజనం దక్కలేదని చెప్పాలి. మొదటి పేరు ప్రియా భవాని శంకర్. హీరోయిన్ అయినప్పటికీ కథ ప్రకారం హీరో భార్యగా నటించడం, ఆమె కన్నా కూతురిగా నటించిన నక్షత్ర ఎక్కువ హైలైట్ కావడం వల్ల ప్రియాకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. అయితే రెండేళ్లకు పైగా భారీ డిజాస్టర్లతో మొహం వాచిపోయిన ఈమెకు ఇరుముడి సక్సెస్ పెద్ద రిలీఫ్. టాలీవుడ్ నుంచి రెండు మూడు ఆఫర్లు వెళ్ళాయట కానీ మరీ క్రేజీవి కాదని టాక్.
ఇక రెండో పేరు శ్వాసిక. తను కూడా హిట్టు కోసం బాగా స్ట్రగుల్ అవుతోంది. టాలెంట్ పుష్కలంగా ఉన్నా సరైన బ్రేక్ దక్కడం లేదు. ఆ మధ్య విజయ్ ఆంటోనీ నూరు దేవుళ్ళులో పెళ్లీడుకొచ్చిన యువకుల తల్లిగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా అది కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ గుర్తింపు రాలేదు. సూర్య వీరభద్రుడులో ఆర్జె బాలాజీ అసిస్టెంట్ గా నటించింది ఈవిడే. క్యారెక్టర్ బాగుంటే ఏజ్ లెక్కలు వేసుకోకుండా నటిస్తున్న శ్వాసికకు ఇరుముడిలో మంచి స్కోప్ దక్కింది.
అయితే నెగటివ్ షేడ్ లో హైలైట్ అవ్వాల్సిన తన కన్నా ఇతర ఎలిమెంట్స్, సైకో గ్యాంగ్, ఎమ్మెల్యే పాత్ర కథను డ్రైవ్ చేయడంతో తనకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. అయినా సరే కరుడు గట్టిన స్కూల్ ప్రిన్స్ పల్ గా చూపులతోనే భయపెట్టింది. ప్రియా భవాని శంకర్, శ్వాసికకు ఇంకొంచెం లెన్త్ దొరికి ఉంటే వాళ్లకు మరింత మెరుగైన ఫలితం దక్కదేమో. క్రెడిట్ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, ముత్యాల పల్లకి పాట పంచేసుకోవడంతో ఉన్నదాంతో సర్దుకోవాల్సి వచ్చింది.
ఏదైతేనేం సినిమా పెద్ద హిట్టయ్యింది. అందరూ హ్యాపీ. రెండు వందల కోట్ల వైపు పరుగులు పెడుతూ టయర్ 2 రికార్డులు సృష్టిస్తున్న ఇరుముడి ఫుట్ ఫాల్స్ విషయంలో ప్యాన్ ఇండియా సినిమాలను దాటిపోవడం పరిశ్రమ వర్గాలను విస్మయపరిచింది. కొన్ని చోట్ల ఏకంగా ఆర్ఆర్ఆర్ స్థాయిలో జనాలు పోటెత్తడం అనూహ్యం. రెగ్యులర్ టికెట్ ధరలు కాబట్టి నెంబర్లు వేగంగా లేవు కానీ ఒకవేళ హైక్స్ తో లెక్కలేసుకుని చూస్తే మటుకు చాలా సెంటర్లు మతులు పోయే షాక్ ఇవ్వడం ఖాయం.
This post was last modified on August 30, 2026 9:53 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…