Movie News

ఇరుముడి తెచ్చిన మంచి సంప్రదాయం

పెద్ద హీరోల సినిమాలు రిలీజయ్యాయంటే చాలు టాక్ ఎలా ఉన్నా.. పోస్టర్ల మీద పెద్ద పెద్ద నంబర్లు పడిపోతాయి. ఈ నంబర్ల ద్వారా ప్లాప్ సినిమాను హిట్ చేస్తుంటారు. హిట్ సినిమాలను బ్లాక్‌బస్టర్లను చేస్తుంటారు. బ్లాక్‌బస్టర్లను ఇండస్ట్రీ హిట్లుగా మార్చేస్తుంటారు. కొన్ని సినిమాలకైతే పోస్టర్ల మీద పడ్డ నంబర్లు చూసి ప్రేక్షకులు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఈ మధ్య రూ.60 కోట్లకు అటు ఇటుగా కలెక్ట్ చేసిన సినిమా పోస్టర్ మీద వంద కోట్ల నంబర్ పడిపోయింది.

సినిమా ఎంత కలెక్ట్ చేసిందన్నది పక్కన పెడితే.. రోజుకు ఇంత అని ఒక నంబర్ కలుపుకుంటూ వెళ్లడం ఒక ప్రాక్టీస్‌గా మారిపోయింది. కొందరు ఫ్యాన్స్ కోసం తప్పక ఫేక్ కలెక్షన్లు వేస్తున్నామని ఓపెన్‌గానే చెబుతారు. కొందరు ఇది మంచి సంప్రదాయం కాదు, దీనికి బ్రేక్ వేయాలని అంటారు. కానీ అలా అనే వాళ్లే ఈ ప్రాక్టీస్‌లో భాగం అవుతుంటారు. దీని వల్ల ప్రేక్షకుల్లో విశ్వనీయత కోల్పోతున్నారు. ఒరిజినల్ కలెక్షన్లు ప్రకటించినా నమ్మలేని పరిస్థితి తలెత్తుతోంది.

ఇలాంటి టైంలో ‘ఇరుముడి’ సినిమా ఒక మంచి సంప్రదాయానికి తెర తీసింది. ఈ సినిమాకు మొదట్నుంచి మేకర్స్ దాదాపుగా ఒరిజినల్ కలెక్షన్లనే పోస్టర్ల మీద వేస్తున్నారు. ఒకవేళ కలెక్షన్లు పెంచి ఉన్నా.. అది చాలా తక్కువ మొత్తమే అని చెప్పాలి. తొలి రోజు ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఓన్ చేసుకుని, తమ భుజాల మీద మోస్తున్నారు. టీం ప్రమోషన్లు చేసినా చేయకపోయినా.. జనాలే దీనికి కావాల్సినంత హైప్ ఇస్తున్నారు.

పెద్ద సిటీ, చిన్న టౌన్ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఈ సినిమా ఇరగాడేస్తోంది. రెండో వీకెండ్లో కూడా కొత్త సినిమాలా థియేటర్లు కళకళలాడుతున్నాయి. టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. నిజంగానే ఈ చిత్రం 4 రోజులకే వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా రూ.150 కోట్ల మైలురాయినీ దాటింది. త్వరలో రూ.200 కోట్ల క్లబ్బులోనూ అడుగుపెట్టింది. ఈ నంబర్లన్నీ కరెక్టే.

వేరే స్టార్ హీరో సినిమాకైతే ఫ్యాన్స్ డిమాండ్ అని చెప్పి ఎప్పుడో రూ.200 కోట్ల పోస్టర్ పడిపోయేదని.. ఫుల్ రన్ అయ్యేసరికి కలెక్షన్లు రూ.300 కోట్లు అని గొప్పలు పోయేవారని.. కానీ రవితేజకు ఈ కలెక్షన్ల పిచ్చి లేకపోవడం.. ఫ్యాన్స్ నుంచి కూడా అలాంటి డిమాండ్లు లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఒరిజినల్ కలెక్షన్లనే ప్రకటిస్తోందని.. ఈ సత్సంప్రదాయం మిగతా సినిమాలకూ కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 30, 2026 5:05 pm

Share

Recent Posts

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

7 minutes ago

టార్గెట్ @ 100 ప‌ర్సంట్‌: మంత్రుల‌కు బాబు బిగ్ టాస్క్‌

ఏపీ మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ మంత్రివ‌ర్గం..…

14 minutes ago

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

1 hour ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

3 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago